Jagannath Rath Yatra 2021: రెండో ఏడాది భక్తులు లేకుండానే పూరి జగన్నాథ యాత్ర.. వెబ్‌క్యాస్టింగ్‌తో ఉత్సవాల వీక్షణకు ఛాన్స్!

వరుసగా రెండో ఏడాది కూడా పూరి జగన్నాథ యాత్ర బోసిపోయి కన్పించబోతోంది. కరోనా కారణంగా రథయాత్రకు భక్తులను అనుమతించడం లేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.

Jagannath Rath Yatra 2021: రెండో ఏడాది భక్తులు లేకుండానే పూరి జగన్నాథ యాత్ర.. వెబ్‌క్యాస్టింగ్‌తో ఉత్సవాల వీక్షణకు ఛాన్స్!
Lord Jagannath Rath Yatra
Follow us

|

Updated on: Jun 11, 2021 | 9:42 AM

Lord Jagannath Rath Yatra 2021: వరుసగా రెండో ఏడాది కూడా పూరి జగన్నాథ యాత్ర బోసిపోయి కన్పించబోతోంది. కరోనా కారణంగా రథయాత్రకు భక్తులను అనుమతించడం లేదని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా మహమ్మారితో సామాన్యులకే దేవుళ్లకు కూడా తీరని కష్టాలు వచ్చాయి. వరుసగా రెండో ఏడాది ప్రపంచ ప్రసిద్ది గాంచిన పూరి జగన్నాథ రథయాత్రను భక్తులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ను పాటిస్తూ రథయాత్రను నిర్వహిస్తామని ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పరిమిత స్థాయిలో భక్తులు. అర్చకులు జగన్నాధుడి రథయాత్రలో పాల్గొంటారు. అది కూడా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నవాళ్లు , కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవాళ్లతోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం జులైలో జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తారు. ప్రతి ఏటా పూరి జగన్నాథరథయాత్రను లక్షలమంది భక్తులతో కన్నుల పండువగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కాని కరోనా మహమ్మారి కారణంగా ఈ ఉత్సవాలను నామమాత్రంగా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతోనే రథయాత్రను నిర్వహిస్తామని ఒడిశా స్పెషల్‌ రిలీఫ్‌ కమిషనర్‌ పీకే జెనా తెలిపారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. జగన్నాథ రథయాత్ర నిర్వహించే రోజున పూరిలో కర్ఫ్యూ విధిస్తామని కూడా ఆయన ప్రకటించారు.

పూరిలో తొమ్మిదిరోజుల పాటు సాంప్రదాయరీతిలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. భక్తులు ప్రత్యక్ష ప్రసారంతో వెబ్‌క్యాస్టింగ్‌తో ఉత్సవాలను వీక్షించవచ్చని రిలీఫ్‌ కమిషనర్‌ తెలిపారు. పూరికి వాహనాల రాకపోకలపై నిషేధం అమల్లో ఉంటుంది. అత్యవసర సేవలకు మాత్రమే ఆరోజు అనుమతి ఉంటుంది.

ఇదిలావుంటే, పూరి నగరంలో ఇప్పటికి కూడా ప్రతిరోజు 300కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని జిల్లా అధికారులు తెలిపారు. రథాల తయారీ ఆఖరి దశకు చేరుకుందని కూడా అధికారులు వెల్లడించారు. జగన్నాధుడు తన సోదరుడు బలభద్రుడు , సుభద్రతో కలిసి రథయాత్ర నాడు ఊరేగడం ఆనవాయితీగా వస్తోంది. రథయాత్ర రెండున్నర కిలోమీటర్ల మేర సాగి గుండిచ ఆలయానికి చేరుకుంటుంది. ఈ దృశ్యాన్ని భక్తులు ఎంతో పారవశ్యంతో తిలకిస్తారు. కాని ఈసారి ఆ అవకాశం లేకుండా పోయింది.

Read Also…  AP Governor Quota MLC: ఏపీలో ఖాళీ అయిన నాలుగు ఎమ్మెల్సీల అభ్యర్థుల ఖరారు.. గవర్నర్‌కు నలుగురి పేర్లు సిఫారసు..!

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..