zodiac-sign: ఈ నాలుగు రాశుల వారి మనస్తత్వాల గురించి తెలిస్తే షాక్ అవుతారు.. తస్మాత్ జాగ్రత్త..
zodiac-sign: సమాజంలో నిజాయితీ కలిగిన వ్యక్తులు చాలా అరుదు. మనుషుల్లో ఎంతోకొంత స్వార్థం, ధ్వేషం, కుట్ర తత్వం కలిగి ఉంటుంది.
zodiac-sign: సమాజంలో నిజాయితీ కలిగిన వ్యక్తులు చాలా అరుదు. మనుషుల్లో ఎంతోకొంత స్వార్థం, ధ్వేషం, కుట్ర తత్వం కలిగి ఉంటుంది. కొంతమంది వ్యక్తులకు కపటత్వమే ఆభరణం. అలాంటి వారి మాటలు పైకి తీపిగా కనిపిస్తాయి. వాస్తవానికి వచ్చేసరికి ఏమాత్రం పోలిక ఉండదు. ఇలాంటి వారే విధ్వంసక, మోసపూరిత ఆలోచనలు కలిగి ఉంటారు. ద్విముఖ ప్రదర్శనతో అందరినీ మోసగిస్తుంటారు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారిలో ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారు ఉంటారని సిద్ధాంతులు చెబుతున్నారు. మరి ఆ నాలుగు రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
1. మిథున రాశి.. ఈ రాశి కలిగిన వారిలో చాలా మంది కపటబుద్ధిని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు చీమలకు కూడా హానీ తలపెట్టరు. చాలా భయస్తుల్లా కనిపిస్తారు. కానీ, వాస్తవానికి వీరే అసలైన విధ్వేషం కలిగి ఉంటారు. వీరి ఆలోచనలన్నీ విషపూర్తితంగా ఉంటాయి. అబద్ధాలను వ్యాప్తి చేస్తారు. మనుషుల ముందు ఒకలా.. మనుషుల వెనుక మరోలా మాట్లాడుతారు.
2. వృశ్చికం.. ఈ రాశిచక్రం ప్రజలు ప్రతిష్టాత్మకమైనవారు. వారు తమ లక్ష్యాలను సాధించడానికి ఎంతవరకైనా వెళతారు. తమకు కావలసినదాన్ని పొందడానికి వారు వాస్తవాలను కూడా దెబ్బతీస్తారు. అవసరమైతే ఎంతకైనా తెగిస్తారు. మరొకరిని వేధించడానికి కూడా సిద్ధ పడుతారు. వీరి మనస్తత్వం విభిన్నంగా ఉంటుంది. ప్రజల ముందు ఒకలా.. వారి వెనుక మరోలా మాట్లాడుతారు. ఈ రాశి వారు.. తాము సున్నిత మనస్తత్వం కలిగిన వారమని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ, వాస్తవానికి వీరు చాలా హానీకరం.
3. ధనుస్సు.. ఈ రాశిచక్రం వారు.. సంఘర్షణను ఇష్టపడరు. సంక్షోభం, గొడవ లను ఎదుర్కోలేరు. వీటి నుంచి తప్పించుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి అబద్ధాలు చెప్పడం, ఇతరులపై అభాండాలు వేయడం వంటివి చేస్తుంటారు. ఇతరుల దృష్టిలో మంచివారమని అనిపించేందుకు నవ్వుతూ మాట్లాడుతుంటారు.
4. మీనం ఈ రాశి ప్రజల్లో ద్వేషం లేదు కానీ, అబద్ధాలే పునాదులుగా ఉంటారు. ఈ రాశిచక్రంలో జన్మించిన వారు.. వ్యక్తులను ఎన్నడూ ఎదరుగా విమర్శించరు. వారి వెనుక విమర్శలు గుప్పిస్తారు. పైకి నవ్వుతూ మాట్లాడుతారు. లోపల మాత్రం ద్వేషిస్తారు. స్వార్థపరులు కాకపోయినప్పటికీ.. అవసరాన్ని బట్టి తమ కపట బుద్ధులను ప్రదర్శిస్తారు.
Also read:
Magnet Man: కరోనా వ్యాక్సీన్ సెకండ్ డోస్ ఎఫెక్ట్.. అయస్కాంతంగా మారిన వ్యక్తి శరీరం..!