Magnet Man: కరోనా వ్యాక్సీన్ సెకండ్ డోస్ ఎఫెక్ట్.. అయస్కాంతంగా మారిన వ్యక్తి శరీరం..!

Magnet Man: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. కరోనా వ్యాక్సీన్ సెకండ్ డోసుకు తీసుకున్న ఓ వ్యక్తి..

Magnet Man: కరోనా వ్యాక్సీన్ సెకండ్ డోస్ ఎఫెక్ట్.. అయస్కాంతంగా మారిన వ్యక్తి శరీరం..!
Magnet Man
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 11, 2021 | 11:21 PM

Magnet Man: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. కరోనా వ్యాక్సీన్ సెకండ్ డోసుకు తీసుకున్న ఓ వ్యక్తి.. వింత ఫిర్యాదు చేశాడు. వ్యాక్సీన్ సెకండ్ డోస్ తీసుకున్న తరువాత తన శరీరంలో అయస్కాంత శక్తి ఉత్పన్నమైందని కంప్లైంట్ ఇచ్చాడు. దీని వల్ల ఇనుము, ఉక్కు పాత్రలు తన శరీరానికి అతుక్కుపోతున్నాయని వాపోయాడు. తన వాదనను నిరూపించడం కోసం బాధిత వ్యక్తి ఒక వీడియోను కూడా తీసి షేర్ చేశాడు. ఈ వీడియోలో ఇంట్లో ఉపయోగించే స్ఫూన్‌లు, చిన్న ప్లేట్స్ సదరు వ్యక్తి శరీరానికి అతుక్కుపోతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

శరీరంలో పెరిగిన అయస్కాంతత్వం.. నాసిక్‌కు చెందిన అరవింద్ జగన్నాథ్ సోనార్.. కొన్ని రోజుల క్రితం కరోనా వ్యాక్సీన్ సెకండ్ డోస్ తీసుకున్నాడు. ఈ సెకండ్ డోస్ వ్యాక్సీన్ తీసుకున్న తరువాతే అతని శరీరంలో ఈ వింత శక్తి కనిపిస్తోందని జగన్నాథ్ ఆరోపిస్తున్నాడు. అయితే, తొలుత చెమట కారణంగా ఇనుప వస్తువుల శరీరానికి అతుకుతున్నాయని జగన్నాథ్ సహా అతని కుటుంబ సభ్యులు భావించారు. అయితే, జగన్నాథ్ స్నానం చేస్తున్న సమయంలోనూ ఇనుప వస్తువులు అతని శరీరానికి అంటుకోవడం చూసి షాక్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతను ఫిర్యాదు చేశారు.

వైద్యులకు సవాల్‌గా జగన్నాథ్ కేసు.. ఇదిలాఉంటే.. ఈ వింత కేసు నాసిక్ వైద్యులకు సవాల్‌గా మారింది. దీనిపై పరిశోధన అవసరం అని చెబుతున్నారు. ప్రస్తుతం దీనిపై వెంటనే ఏం కామెంట్స్ చేయలేమని వైద్యులు పేర్కంటున్నారు. ఈ వింత కేసుకు సంబంధించిన వివరాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని నాసిక్ జిల్లాకు చెందిన వైద్యులు అశోక్ తోరత్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

యూట్యూబ్ వీడియోలో ఏముందంటే.. అరవింద్ సోనార్ కుమారుడు తాను యూట్యూబ్‌లో ఒక వీడియోను చూశానని, అందులో రెండవ మోతాదు కరోనా తీసుకున్న తర్వాత తన శరీరంలో అయస్కాంత శక్తి తలెత్తిందని ఢిల్లీకి చెందిన వ్యక్తి చెబుతున్నారని ఉటంకించారు. ‘ఒకసారి తాము కూడా ప్రయత్నిద్దామని చూసి నాణెలు, స్ఫూన్స్, ప్లేట్స్ వంటి ఇనుప వస్తువులను నాన్న శరీరానికి దగ్గరగా తీసుకెళ్లాం. దాంతో అవి నాన్న శరీరానికి అతుక్కుపోయాయి. అది చూసి అంతా షాక్ అయ్యాం.’ అని జగన్నాథ్ తనయుడు చెప్పుకొచ్చాడు.

వ్యాక్సీన్‌పై అయోమయం.. మహారాష్ట్రలో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడంపై ఇప్పటికే గందరగోళం, భయం ఉన్న వాతావరణం ఉంది. చాలా గ్రామాల్లో, కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇలాంటి కథనాలు ప్రచారంలోకి రావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రభుత్వం, అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించాలని పలువురు అభ్యర్థిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఇది కరోనా వ్యాక్సీన్ వల్ల అయిఉండకపోవచ్చు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Insta Video:

View this post on Instagram

A post shared by Bol Bhidu (@bolbhidu)

Also read:

AP Weather Alert: అల్పపీడనం ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం..