TSRTC: ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి ‘సైబర్ లైనర్’.. బస్సులో ప్రతీది స్పెషలే..

ఐటీ ఎంప్లాయిస్‌ టార్గెట్‌గా కొత్త సర్వీసులను ప్రారంభించింది టీఎస్‌-ఆర్టీసీ. సైబర్‌ లైనర్‌ పేరుతో ఏసీ మినీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవును, ఐటీ ఉద్యోగుల సౌకర్యం కోసం..

TSRTC: ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి ‘సైబర్ లైనర్’.. బస్సులో ప్రతీది స్పెషలే..
Cyber Liner Bus
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 10, 2023 | 8:06 AM

ఐటీ ఎంప్లాయిస్‌ టార్గెట్‌గా కొత్త సర్వీసులను ప్రారంభించింది టీఎస్‌-ఆర్టీసీ. సైబర్‌ లైనర్‌ పేరుతో ఏసీ మినీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అవును, ఐటీ ఉద్యోగుల సౌకర్యం కోసం సరికొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్‌-ఆర్టీసీ. సైబర్‌ లైనర్‌ పేరుతో ఏసీ మినీ బస్సులను ప్రారంభించింది. హైటెక్‌ సిటీ దగ్గర ఈ బస్సులను ప్రారంభించారు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌. ఐటీ కారిడార్‌ ఏరియాలో మాత్రమే సైబర్‌ లైనర్‌ మినీ బస్సులు తిరగనున్నాయ్‌. ఈ బస్సుల ప్రత్యేక వైఫై సౌకర్యం, ట్రాకింగ్‌ సిస్టం. ఐటీ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఈ బస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు టీఎస్‌-ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌.

సైబర్‌ లైనర్‌ బస్సులను ఐటీ ఉద్యోగులతోపాటు సామాన్య ప్రజలు కూడా ఉపయోగించుకోవచ్చన్నారు అధికారులు. అందరికీ ఉపయోగకరంగా ఉండాలనే మినీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఐటీ ఎంప్లాయిస్‌ ఈ బస్సులను వినియోగించుకుంటే ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్య తగ్గతుందన్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..