TSRTC: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. గరుడ ఛార్జీలను భారీగా తగ్గించిన యాజమాన్యం..
TSRTC Reduce Garuda Plus Charges : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గరుడ ప్లస్ ఛార్జీలను (Garuda Plus charges) తగ్గిస్తూ
TSRTC Reduce Garuda Plus Charges : తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గరుడ ప్లస్ ఛార్జీలను (Garuda Plus charges) తగ్గిస్తూ గురువారం ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఈ నిర్ణయం తీసుకున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణీకులకు మరింత దగ్గరయ్యేందుకు టీఎస్ఆర్టీసీ శత విధాల ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా సవరించినట్లు పేర్కొన్నారు. రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసినట్లు టీఎస్ఆర్టీసీ పేర్కొంది. కాగా.. సవరించిన, తగ్గించిన ఛార్జీలు మార్చి 31 వరకు వర్తించనున్నాయి. అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో అయితే తెలంగాణ సరిహద్దు దాటిన తరువాత అంతకు ముందున్న ఛార్జీలే వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే.. హైదరాబాద్-బెంగళూరు మార్గంలో నడిచే ఏసీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేశారు. రవాణా రంగంలో ఉన్న పోటీని తట్టుకొని.. ప్రయాణీకులకు మరిన్ని మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని ఎండీ సజ్జనార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. టీఎస్‌ఆర్టీసీ నిర్ణయంతో హైదరాబాద్-విజయవాడ మధ్య రూ.100, హైదరాబాద్-ఆదిలాబాద్ మధ్య రూ.111, హైదరాబాద్-భద్రాచలం మధ్య రూ. 121, హైదరాబాద్-వరంగల్ మధ్య రూ.54 తగ్గినట్లు సజ్జనార్ పేర్కొన్నారు.
Also Read: