Andhra Pradesh: అప్పటికల్లా కొత్త జిల్లాల ఏర్పాటు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచనల కామెంట్స్ చేశారు. జిల్లాల పునర్విభజన సమీక్షలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఉగాది నాటికే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని అన్నారు.
కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy ) కీలక ప్రకటన చేశారు. జిల్లాల పునర్విభజన సమీక్షలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఉగాది నాటికే కొత్త జిల్లాలను(New Distcs) ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని సీఎం జగన్ ప్రకటించారు. సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయన్నారు. ఉగాది నుంచే కలెక్టర్లు, ఎస్పీల కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. దానికి సంబంధించిన సన్నాహాలు చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ప్రస్తుతమున్న కలెక్టర్లు, ఎస్పీలకు కొత్త జిల్లాల బాధ్యతలు అప్పగించాలన్నారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజునుంచే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు నిర్వహిస్తారన్నారు.
రాష్ట్రంలోఇప్పుడున్న జిల్లాలకు అదనంగా 13 జిల్లాలను కలుపుతూ 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ నియోజకవర్గానికొక జిల్లాను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజునుంచే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు కొనసాగుతారని వెల్లడించారు.
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత.. యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేయాలి :
కొత్త జిల్లాలో పని ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదని సూచించారు. పాలన సాఫీగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. దీనికోసం సన్నాహకాలను చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా మొదలు పెట్టాలన్నారు. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు జరగాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పనిచేయడానికి అవసరమైన భవనాల గుర్తించాలని అధికారులకు సూచించారు సీఎం జగన్.
అన్నిరకాలుగా సిద్ధం కావాలి :
కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేలోగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాల్సిన భవనాలు తదితర వాటిని గుర్తించాలన్నారు. అలాగే కొత్త భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలను ఖరారు చేయాలన్నారు. అందుకోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలన్నారు.
నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడ్డం చాలా ముఖ్యం:
నిర్ణయం తీసుకునేముందు కొత్తగా వెళ్లేవారితో మాట్లాడాని.. వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం ఆదేశించారు. వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందన్నారు.
వీరు కొత్త జిల్లాల్లో మౌలికసదుపాయాలు, పాలన సాఫీగా సాగేందుకు వీలుగా సన్నాహకాలను పరిశీలిస్తారన్న ముఖ్యమంత్రి జగన్. స్థానిక సంస్థల (జిల్లాపరిషత్‌ల విభజన) విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా వ్యవహరించాలని అన్నారు. చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు తయారుచేస్తామన్నారు అధికారులు.
ఇవి కూడా చదవండి: Great Khali: ఎన్నికల వేల బీజేపీలో చేరిన మహా బలుడు.. ప్రధాని మోడీపై ది గ్రేట్ ఖలీ ప్రశంసలు…
UP Assembly Election 2022 Phase 1 Polling Live Updates: మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 35.03 శాతం ఓటింగ్