AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Assembly Election 2022 Phase 1 Polling Highlights: ముగిసిన తొలి దశ పోలింగ్.. ఓటింగ్ శాతం మాత్రం..

Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Feb 10, 2022 | 9:41 PM

ఉత్తరప్రదేశ్‌లొ తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ లోని 58 నియోజకవర్గాల్లో తొలివిడతలో ఎన్నికలు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు పోటెత్తారు.

UP Assembly Election 2022 Phase 1 Polling Highlights: ముగిసిన తొలి దశ పోలింగ్.. ఓటింగ్ శాతం మాత్రం..
Up Elections

Uttar Pradesh Assemly Election 2022: ఉత్తరప్రదేశ్‌లొ తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ( Phase 1 Polling) ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ లోని 58 నియోజకవర్గాల్లో తొలివిడతలో ఎన్నికలు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు పోటెత్తారు. మహిళలు , యువత కూడా ఉత్సాహంగా ఓటు వేసేందుకు ముందుకొచ్చారు. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉత్తరప్రదేశ్ తొలిదశ ఎన్నికలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలి విడత పోలింగ్‌కు గురువారం ముందురోజు నాటికి ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో భద్రతా ఏర్పాట్లు చేశారు. 403 అసెంబ్లీ స్థానాలక గానూ ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకటించింది. ఇందులో భాగంగా 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగుతోంది. మొదటి దశ ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.

తొలిదశలో ఇవాళ ముజఫర్‌నగర్, ఘజియాబాద్, మీరట్, షామ్లి, బాగ్‌పత్, గౌతమ్‌బుద్ధ్ నగర్, హాపూర్, బులంద్ షహర్, అలీఘర్, మధుర, ఆగ్రాల్లో పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కోవిడ్ సంక్రమణ నేపధ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద థర్మల్ స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేశారు. సిబ్బంది కోసం అవసరమైన గ్లౌజులు, ఫేస్ మాస్కులు, ఫేస్‌షీల్డ్‌లు, పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచారు. తొలిదశ పోలింగ్ జరగనున్న 11 జిల్లాల్లోనూ 50 వేలమంది పారా మిలిటరీ సిబ్బందిని మొహరించారు. పోలింగ్‌ పార్టీలను కూడా ఓటింగ్‌కు పంపించడంతోపాటు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కరోనా దృష్ట్యా, పోలింగ్ కేంద్రాల వద్ద గరిష్ట సంఖ్యలో ఓటర్లు 1,250కి చేరుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

58 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 2.28 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.24 కోట్ల మంది పురుషులు, 1.04 కోట్ల మంది మహిళలు, 1,448 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. తొలి దశ ఎన్నికల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 623 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, వారిలో 73 మంది మహిళా అభ్యర్థులు. మొదటి దశలో 26,027 పోలింగ్‌ కేంద్రాలు, 10,853 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 467 ఆదర్శ్ పోలింగ్ స్టేషన్లు, 139 మహిళా కార్మికులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

పోలింగ్ పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాలో 50 శాతం పోలింగ్ స్థలాల్లో ప్రత్యక్ష ప్రసార వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని జిల్లా ఎన్నికల అధికారి, ప్రధాన ఎన్నికల అధికారి, మూడు స్థాయిలలో భారత ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన సంఖ్యలో పారామిలటరీ బలగాలను మోహరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పారామిలటరీ బలగాలను మోహరించడంతోపాటు ఈవీఎంల స్ట్రాంగ్ రూం భద్రత బాధ్యతను కూడా పారామిలటరీ బలగాలకు అప్పగించారు.

ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు 7,057 భారీ వాహనాలు, 5,559 తేలికపాటి వాహనాలు, 1,20,876 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ఎన్నికల్లో మొత్తం 26,027 పోలింగ్‌ కేంద్రాలకు ఓటింగ్‌కు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, వివిధ జిల్లాల్లో తగినన్ని ఈవీఎంలు, వీవీప్యాట్‌ల కోసం ఏర్పాట్లు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్‌లలో ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో సాంకేతిక శిక్షణ పొందిన సిబ్బందికి ఏర్పాట్లు చేశారు.

ఇదిలావుంటే, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ భారతీయ జనతా పార్టీ, బహుజన సమాజ్ వాదీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ఉండనుంది. 2017లో జరిగిన ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ జరుగుతున్న ఈ 58 స్థానాల్లో 53 స్థానాల్ని అధికార పార్టీ బీజేపీ కైవసం చేసుకుంది. ఫిబ్రవరి, 14న రెండవ దశ, ఫిబ్రవరి 20న మూడవ దశ, ఫిబ్రవరి 23 న నాలుగవ దశ, ఫిబ్రవరి 27వ తేదీన ఐదవ దశ, మార్చ్ 3న ఆరవ దశ, మార్చ్ 7 న ఏడు దశ పోలింగ్ జరగనుంది.

Read Also…. PM Narendra Modi: ఆ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి ముప్పు.. ఐదు రాష్ట్రాల్లో బీజేపీనే గెలుస్తుంది: ప్రధాని మోదీ

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 10 Feb 2022 08:22 PM (IST)

    ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం..

    యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ముగిసిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సీల్ చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో భద్రం ఉండనుంది.

  • 10 Feb 2022 07:25 PM (IST)

    తొలి విడత పోలింగ్ ముగిసింది

    ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ పూర్తైంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా.. పోలింగ్ అంతా ప్రశాంతంగానే సాగింది.

  • 10 Feb 2022 07:23 PM (IST)

    గత ఎన్నికల్లో విజయం..

    2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 58 సీట్లలో 53 బీజేపీ గెలుచుకుంది. సమాజ్​వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు రెండేసి స్థానాలు కైవసం చేసుకున్నాయి. రాష్ట్రీయ లోక్​ దళ్ ఒక సీటుతో సరిపెట్టుకుంది.

  • 10 Feb 2022 07:23 PM (IST)

    ఓటర్ల చేతిలో అభ్యర్థుల అదృష్టం..

    మొత్తంగా 623 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులైన శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గార్గ్, చౌధురి లక్ష్మీ నరైన్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలకు ఈ దశలోనే పోలింగ్ జరిగింది.

  • 10 Feb 2022 07:21 PM (IST)

    పోలింగ్​ను కావాలని నెమ్మదిగా సాగేలా చేశారు

    రోవైపు, ఏ నియోజకవర్గాల్లో ఈవీఎంలు పనిచేయలేదో గుర్తించి చర్యలు తీసుకోవాలన్ని ఎన్నికల సంఘాన్ని కోరారు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్. పోలింగ్​ను కావాలని నెమ్మదిగా సాగేలా చేశారని ఆరోపించారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. పారదర్శక ఓటింగ్ జరిగేలా చూడటం ఈసీ అతిపెద్ద బాధ్యత అని ట్వీట్ చేశారు.

  • 10 Feb 2022 06:42 PM (IST)

    మహిళల కోసం గులాబీ రంగు మరుగుదొడ్లు

    ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకంలో లక్ష రూపాయల వరకు సహాయం చేసినట్లుగా వెల్లడిచారు వారణాసిలో  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. రూ.వెయ్యి కోట్లతో మార్కెట్లలో గులాబీ రంగు మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. మరో 3 మహిళా పోలీసు బెటాలియన్లు ఏర్పాటు, మహిళల భద్రత కోసం 3000 పింక్ పోలీస్ స్టేషన్లు నిర్మించనున్నారు.

  • 10 Feb 2022 06:34 PM (IST)

    ఓటు వేయలేకపోయిన RLD అధ్యక్షుడు జయంత్ చౌదరి

    మధురలో తొలి దశ పోలింగ్ ముగిసింది. RLD అధ్యక్షుడు జయంత్ చౌదరి ఓటు వేయలేకపోయారు. సమయం ముగిసే వరకు అంటే సాయంత్రం 6 గంటల వరకు ఆయన పోలింగ్ కేంద్రానికి చేరుకోలేకపోయారని చెబుతున్నారు.

  • 10 Feb 2022 06:05 PM (IST)

    టెర్రరిస్టులకు ఇక్కడ స్థానం లేదు.. – బీజేపీ జాతీయ అధ్యక్షుడు

    ఉగ్రవాదులకు ఉత్తర ప్రదేశ్‌లో ఎలాంటి ఆశ్రయం లభించదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా స్పష్టం చేశారు. అందుకే దేవ్‌బంద్, మీరట్, అజంగఢ్, రాంపూర్, బహ్రైచ్, కాన్పూర్‌లలో ‘యాంటీ టెర్రరిస్ట్ కమాండో సెంటర్’ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. హర్దోయ్‌లో ఆయన పర్యటన కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌ను భయాందోళనలకు గురిచేయకుండా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

  • 10 Feb 2022 05:22 PM (IST)

    తొలి దశ పోరులో 73 మంది మహిళలు..

    తొలి దశ పోరులో 73 మంది మహిళలు సహా 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. శ్రీకాంత్ శర్మ, సురేష్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గార్గ్ మరియు చౌదరి లక్ష్మీ నారాయణ్ వంటి మంత్రుల భవితవ్యం మొదటి దశలో నిర్ణయించబడుతుంది. 2017లో 58 స్థానాలకు గాను బీజేపీ 53, ఎస్పీ, బీఎస్పీలకు చెరో రెండు సీట్లు వచ్చాయి. ఒక సీటు ఆర్‌ఎల్‌డీకి పోయింది. 

  • 10 Feb 2022 05:21 PM (IST)

    పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం..

    ఓ వ్యక్తి పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సదర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చార్ ఖంబా పోలింగ్ స్టేషన్​లో బలరాం అనే వ్యక్తి వివాహ దుస్తుల్లో వచ్చి ఓటేశారు. పెళ్లి వేడుకలో భాగంగా జాట్ వర్గం ప్రజలు నిర్వహించుకునే ‘గూడ్​చాది కార్యక్రమం’ పూర్తి చేసుకున్న బలరాం.. ద్విచక్ర వాహనంపై వచ్చి ఓటు వేశారు.

  • 10 Feb 2022 05:20 PM (IST)

    తొలి దశ పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో జాట్‌ల ఆధిపత్యం..

    రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోని 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌తో ఉత్తరప్రదేశ్‌లో పోరు గురువారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. మొదటి దశ పశ్చిమ యుపిలోని జాట్‌ల ఆధిపత్య బెల్ట్‌ను కవర్ చేస్తుంది, ఇక్కడ నుండి దేశ రాజధానిలో కేంద్రం యొక్క మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలో చురుకుగా పాల్గొన్నారు. 

  • 10 Feb 2022 05:10 PM (IST)

    ఓటు వేయాలంటూ పోలింగ్ స్టేషన్లలో డప్పులతో స్వాగతం

    ఓటర్లను ఆకర్శించేందుకు ఎన్నికల అధికారులు వినూత్న పద్దతులను ఫాలో అవుతున్నారు. ఉత్తర ప్రదేశ్ లో మొదటి దశ పోలింగ్ జరిగిన ఘజియాబాద్ జిల్లాలో ఓటర్లను పోలింగ్ స్టేషన్లలో డప్పులతో స్వాగతం పలికారు.

  • 10 Feb 2022 05:06 PM (IST)

    ఓటింగ్ సరళి తమకే అనుకూలంగా ఉంది.. అఖిలేష్ యాదవ్

    ఓటింగ్ జరుగుతున్న తీరు చూస్తుంటే ఈరోజు ఓటింగ్ ఫలితం వస్తుందా అన్నట్లుగా ఉందని బిజ్నోర్‌లో జరిగిన ర్యాలీలో అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ప్రధాని మోడీకి ఇక్కడ ప్రతికూల వాతావరణం ఉందన్నారు. వాతావరణం తమ పార్టీకి అనుకూలంగా ఉందని అన్నారు. యూపీలో మార్పు రావడానికి చాలా రోజులు సమయం లేదని జోస్యం చెప్పారు.

     

  • 10 Feb 2022 04:51 PM (IST)

    ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఇసుక కళాకారుల ప్రయత్నం

    నోయిడా సెక్టార్ 119లోని పోలింగ్ బూత్‌లో ఓ ఇసుక కళాకారుడు ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రూపేష్ సింగ్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కూడా ఓటరు అవగాహన ప్రచారంలో చాలా కష్టపడ్డాను. రాత్రంతా కష్టపడి ఇసుకతో సిద్ధం చేశాను.” అంటూ వెల్లడించారు.

  • 10 Feb 2022 04:05 PM (IST)

    ఈవీఎంలు లోపభూయిష్టంగా ఉన్నాయి- ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్

    ఈవీఎంలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బిజ్నోర్‌లో విమర్శించారు. ఈ ఉదయం నుంచి చాలా చోట్ల సమాచారం అందుతున్నట్లు చెప్పారు. చాలా గంటలు EVMలో ఓటు వేయలేకపోయారు. అలాంటి అడ్డంకులు రాకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం సన్నాహాలు చేసి ఉండాల్సింది.

  • 10 Feb 2022 04:00 PM (IST)

    దేశ ప్రగతికి ప్రాంతీయ పార్టీలు పెను ముప్పుగా మారాయి..

    అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా. సీతాపూర్‌లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మిగిలిన పార్టీలు కుటుంబ పార్టీలని విమర్శిచారు. వారికి కుటుంబం అభివృద్ధి తప్ప.. ప్రజల క్షేమం అవసరం లేదని విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు దేశానికి పెను ముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.

  • 10 Feb 2022 03:52 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ జరిగిందంటే..

    ముజఫర్‌నగర్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 52.17 శాతం పోలింగ్‌ నమోదైంది. ఘజియాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 43.10 శాతం, నోయిడాలో 43 శాతం, దాద్రీ సీటులో 49 శాతం ఓటింగ్ నమోదైంది. ఆగ్రాలో 47.51 శాతం, బఘత్‌పట్‌లో 50.13 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 10 Feb 2022 03:51 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటల వరకు 48.3% ఓటింగ్ నమోదైంది..

    మరో రెండు గంటలు మాత్రమే మిగిలివుంది. ఓటర్ పోర్టల్ యాప్ ప్రకారం.. యుపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొదటి దశ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. యూపీలోని 11 జిల్లాల్లోని 58 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ 58 స్థానాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 48.24 శాతం ఓటింగ్ నమోదైంది.

  • 10 Feb 2022 03:46 PM (IST)

    సీఎం యోగి స్టైల్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన స్థానిక యువకుడు..

    ఉత్తర ప్రదేశ్ తొలి దశ పోలింగ్ ప్రశంతంగా సాగుతోంది. అక్కడ ముఖ్యమంత్రి యోగిపై అక్కడి యువతలో మంచి క్రేజ్ ఉంది. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అంటే అక్కడి యూత్‌కు తెగ ఇష్టం. తాజాగా జరుగుతున్న పోలింగ్‌లో రాజు కోహ్లీ అనే యువకుడు సీఎం యోగి ఆదిత్యనాథ్ తరహాలో ఓటు వేసేందుకు నోయిడా పోలింగ్ కేంద్రంకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. రాజు ఇలా సీఎం యోగీ తరహాలో రావడంతో అక్కడ ఓటింగ్ కోసం ఉన్నవారు ముందుగా షాకయ్యారు. ఆ తర్వాత అతనితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

  • 10 Feb 2022 02:40 PM (IST)

    ఎన్నికల అధికారులకు ఇదే మా వినతి.. సమాజ్‌వాదీ పార్టీ

    ఆగ్రాలోని బహ్ విధానసభ-94లోని జైద్‌పూర్ బూత్‌లో ఎవరినీ ఓటు వేయడానికి అనుమతించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిశీలించాలని, సజావుగా, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని కోరింది.

  • 10 Feb 2022 02:25 PM (IST)

    అలీగఢ్ జిల్లాలో ఛారా నియోజకవర్గంలో 1 గంటపాటు నిలిచిపోయిన పోలింగ్..

    అలీగఢ్ జిల్లాలోని ఛారా విధానసభ-74, బూత్ నెం-443 వద్ద ఉన్న ఈవీఎం యంత్రాన్ని 1 గంటపాటు మూసి ఉంచినట్లు సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల కమిషన్‌కు తెలిపింది. ఓటింగ్ సజావుగా జరిగేలా చూసుకోవాలని జిల్లా అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీని కోరింది.

  • 10 Feb 2022 02:07 PM (IST)

    మధ్యాహ్నం 1 గంట వరకు 35 శాతం ఓటింగ్

    ఉత్తరప్రదేశ్ శాసనసభకు మొదటి దశలో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంటల వరకు 11 జిల్లాల్లో మొత్తం35.03% ఓటింగ్ శాతం నమోదైంది.

    జిల్లాల వారీగా పరిశీలిస్తే….

  • 10 Feb 2022 01:25 PM (IST)

    ఒంటి గంట వరకూ 40 శాతం పోలింగ్

    యూపీలో ఫస్ట్‌ఫేస్‌ పోలింగ్‌ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం భారీగా పెరగ్గా..మరికొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 11 జిల్లాల్లో మొత్తం35.03% ఓటింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. షామ్లి జిల్లాలో అత్యధికంగా 41శాతం నమోదు కాగా, అలీగఢ్‌లో కేవలం 32 శాతం మంది మాత్రమే ఓటేసినట్లు ఈసీ పేర్కొంది.

  • 10 Feb 2022 01:19 PM (IST)

    ఎన్నికల సంఘానికి సమాజ్‌వాదీ ఫిర్యాదు

    ఓటు వేయకుండా ఓటర్లను ఆపడంపై సమజ్‌వాదీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

  • 10 Feb 2022 12:45 PM (IST)

    సహరాన్‌పూర్‌లో ర్యాలీలో ప్రధాని మోడీ

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సహరాన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.

  • 10 Feb 2022 12:41 PM (IST)

    కూటమికి అనుకూలంగా ప్రేమతో బటన్‌ను నొక్కండి: జయంత్ చౌదరి

    తొలి దశ పోలింగ్ సందర్భంగా ఈవీఎం పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌదరి అన్నారు. యువత, రైతులు పూర్తి ఆగ్రహంతో బటన్ నొక్కుతున్నట్లు తెలుస్తోంది. మీరు నొక్కాల్సి మిషన్‌ను కాదు, SP-RLD కూటమికి అనుకూలంగా ప్రేమతో బటన్‌ను నొక్కండి.అంటూ జయంత్ చౌదరి ట్వీట్ చేశారు

  • 10 Feb 2022 12:35 PM (IST)

    మంత్ నియోజకవర్గంలో ఓటేసిన SP-RLD అభ్యర్థి

    మంత్ అసెంబ్లీ నియోజకవర్గంలో SP-RLD అభ్యర్థి సంజయ్ లాథర్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధురలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

  • 10 Feb 2022 12:33 PM (IST)

    బాగ్‌పత్‌లో కుటుంబసమేతంగా ఓటేసిన బీజేపీ ఎంపీ డాక్టర్ సత్యపాల్ సింగ్

    భాగ్‌పత్‌కు చెందిన బీజేపీ ఎంపీ డాక్టర్ సత్యపాల్ సింగ్ తన భార్య, కుమారుడు, కుమార్తె చారు ప్రగ్యాతో కలిసి తన స్వగ్రామమైన బసౌలీలో ఓటు వేశారు. బసౌలి గ్రామంలోని హరిజన్ చౌపాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    Bjp Mp

    Bjp Mp

  • 10 Feb 2022 12:22 PM (IST)

    షామ్లీ జిల్లాలో 23 శాతం ఓటింగ్

    షామ్లీలో ఉదయం 11 గంటల వరకు 22.83 శాతం ఓటింగ్ జరిగింది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో అత్యధికంగా ఓటింగ్ నమోదు అయ్యింది. అత్యల్పంగా ఘజియాబాద్‌లో 18 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 10 Feb 2022 12:20 PM (IST)

    ఓటేసిన కేంద్ర మంత్రి డాక్టర్ సంజీవ్ బల్యాన్

    ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో కేంద్ర మంత్రి డాక్టర్ సంజీవ్ బల్యాన్ ఓటు వేశారు. గతంలో ఈ ప్రాంతాన్ని క్రైమ్ క్యాపిటల్ అని పిలిచేవారని, ప్రస్తుతం శాంతిభద్రతలకు నిలయంగా మారి, అభివృద్ధి కొనసాగుతోందని, మాఫియా రాజ్యం అంతమైందని సంజీవ్ బల్యాన్ అన్నారు.

  • 10 Feb 2022 12:12 PM (IST)

    కేంద్రమంత్రి వీకే సింగ్‌తో కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ

    ఘజియాబాద్‌లో ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ మీడియాతో మాట్లాడడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మద్దతుదారులు నిరసనకు దిగారు. రాజ్‌నగర్‌లోని షిల్లర్ స్కూల్ వెలుపల కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారుల మధ్య వాగ్వాదం జరిగింది.

  • 10 Feb 2022 12:02 PM (IST)

    ఓటు వేసిన రాకేష్ తికాయత్

    భారతీయ కిసాన్ యూనియన్ (BKU) ప్రతినిధి రాకేష్ తికాయత్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశకు గురువారం ఓటు వేశారు. మొదటి దశలో పశ్చిమ యూపీలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ప్రాంతం ఎక్కువగా జాట్‌ల ఆధిపత్య కొనసాగుతుంది. దేశ రాజధానిలో కేంద్ర మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచి రైతులు ఆందోళనలో చురుకుగా పాల్గొన్నారు.

  • 10 Feb 2022 11:57 AM (IST)

    ఓటర్లు తప్పు చేస్తే యూపీ.. కాశ్మీర్, బెంగాల్‌గా మారవచ్చు: యోగి ఆదిత్యనాథ్

    ఉత్తరప్రదేశ్ ‘ఓటర్లు తప్పు చేస్తే’ రాష్ట్రం కాశ్మీర్, కేరళ లేదా బెంగాల్‌గా మారుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే భయం లేని జీవితానికి హామీ ఇస్తుందని సీఎం యోగి వీడియోలో పేర్కొన్నారు.

  • 10 Feb 2022 11:53 AM (IST)

    ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం పోలింగ్

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.03 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

  • 10 Feb 2022 11:43 AM (IST)

    మీరట్ జిల్లాలో 17శాతం పోలింగ్

    మీరట్ జిల్లాలోని 7 అసెంబ్లీలలో ఉదయం 11 గంటలకు 17% ఓటింగ్ నమోదైంది.

  • 10 Feb 2022 11:42 AM (IST)

    మొరాయించిన EVMను వెంటనే సరిదిద్దాంః DM బాలాజీ

    మీరట్ జిల్లాలో సకాలంలో ఓటింగ్ ప్రారంభమైందని డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ బాలాజీ తెలిపారు. ఒక పోలింగ్ బూత్‌లో ఈవీఎం యంత్రం పనిచేయకపోవడం గురించి సమాచారం ఉంది, దాన్ని వెంటనే సరిదిద్దామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం మోహరించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 9 శాతం ఓటింగ్ నమోదైంది. ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని ఆశిస్తున్నామని బాలాజీ తెలిపారు.

  • 10 Feb 2022 11:38 AM (IST)

    బులంద్‌షహర్‌లో బారులు తీరిన ఓటర్లు

    తొలి దశ పోలింగ్‌లో భాగంగా బులంద్‌షహర్‌లో ప్రజలు ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఓట్లు బారులు తీరారు.

  • 10 Feb 2022 11:36 AM (IST)

    ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు: మృగాంక సింగ్

    కైరానా నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మృగాంక సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ సరళి పట్ ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృగాంక సింగ్ మాట్లాడుతూ, ప్రజలు బీజేపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. గత ఐదేళ్లలో బీజేపీ సుపరిపాలన చూశామని, శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని చెప్పాను. వచ్చే ఐదేళ్లు కూడా బీజేపీకి అవకాశం ఇవ్వండి. మీ ఆశలు నెరవేరుతాయని అన్నారు.

  • 10 Feb 2022 11:34 AM (IST)

    అభివృద్ధి అనేది సిద్ధాంతం కావాలి: అఖిలేష్ యాదవ్

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 7 విడుతలుగా జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఇవాళ తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటింగ్ రోజున, అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేస్తూ, న్యూ యూపీ కొత్త నినాదం: అభివృద్ధి ఒక సిద్ధాంతంగా మారాలి. అంటూ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

  • 10 Feb 2022 11:29 AM (IST)

    ముజఫర్‌నగర్‌లో ఓటేసిన నవ వరుడు

    ఈరోజు తన పెళ్లికి ముందు ముజఫర్‌నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేయడానికి వచ్చాడు నవ వరుడు అంకుర్ బల్యాన్. “ముందు ఓటింగ్, ఆ తర్వాత పెళ్లి, వేడుకలు, తర్వాత అన్ని పనులు.” ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కొత్త పెళ్లి కొడుకు అంకుర్ తెలిపారు.

  • 10 Feb 2022 11:25 AM (IST)

    ఎక్కడా శాంతిభద్రతల సమస్య లేదుః షామ్లీ DM

    షామ్లీ జిల్లలో అన్ని బూత్‌లలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని DM జస్జిత్ కౌర్ తెలిపారు. కొన్ని యాదృచ్ఛిక బూత్‌ల నుండి EVMలకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు అందాయి, మేము ఆ యంత్రాలను భర్తీ చేస్తున్నాము. వాటి సమస్యను పరిష్కరిస్తున్నాము. ఎక్కడా శాంతిభద్రతల సమస్య లేదని షామ్లీ DM జస్జిత్ కౌర్ వెల్లడించారు.

  • 10 Feb 2022 11:22 AM (IST)

    అభివృద్ధి అజెండాపై పోరాడుతున్నాంః సంగీత్ సోమ్

    ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అనే మంత్రంతో పని చేస్తూ అభివృద్ధి అజెండాపై పోరాడుతున్నామని సర్ధానా అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సంగీత్ సోమ్ తెలిపారు. యూపీ రాష్ట్ర ప్రజలు బుజ్జగింపు రాజకీయాలను చూడకూడదని, అభివృధ్ది కోసం ఓటు వేయాలన్నారు.

  • 10 Feb 2022 11:19 AM (IST)

    ఓటు వేయలేకపోతున్న ఆర్‌ఎల్డీ నేత జయంత్ చౌదరి

    రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ జయంత్ చౌదరి తన ఎన్నికల ర్యాలీ కారణంగా ఈరోజు ఓటు వేయలేనని తెలిపారు. మధుర ప్రాంతానికి చెందిన ఓటరు అయిన జయంత్ చౌదరి తన ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నట్లు ఆయన కార్యాయ సిబ్బంది తెలిపింది.

  • 10 Feb 2022 11:16 AM (IST)

    ఓటు వినియోగించుకున్న కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్

    ఘజియాబాద్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి జనరల్ వీకే సింగ్.. మురాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రాజ్‌నగర్ బూత్‌లో ఓటు వేశారు.

  • 10 Feb 2022 11:15 AM (IST)

    ఓటు వేసిన కేంద్ర మంత్రి బఘేల్

    మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలలో బులంద్‌షహర్‌లోని పోలింగ్ బూత్‌లో BJP MP భోలా సింగ్ ఓటు వేయగా, కేంద్ర మంత్రి SP సింగ్ బఘేల్ ఆగ్రాలోని సౌత్ అసెంబ్లీ స్థానంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 10 Feb 2022 11:12 AM (IST)

    మొదటి 2 గంటల్లో 8% ఓటింగ్

    ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశలో ఉదయం 9 గంటల వరకు 11 జిల్లాల్లో సగటున 7.93% ఓటింగ్ నమోదైంది. ఈమేరకు యూపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

  • 10 Feb 2022 10:04 AM (IST)

    భయం నుండి దేశాన్ని విముక్తి చేయండిః రాహుల్ గాంధీ

    ఎన్నికలు 2022 లైవ్ ఓటింగ్: ‘దేశాన్ని భయం నుండి విముక్తి చేయండి, ఓటు వేయడానికి రావాలని’ ప్రజలను రాహుల్ గాంధీ కోరారు. “ప్రతి భయం నుండి దేశాన్ని విముక్తి చేయండి- బయటకు రండి, ఓటు వేయండి!” అని కాంగ్రెస్ నేత ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ఉదయం 7:00 గంటలకు ప్రారంభమైంది.

  • 10 Feb 2022 10:03 AM (IST)

    ఉదయం 9గంటల వరకు 8% పోలింగ్

    యూపీలో తొలి దశ పోలింగ్ ఉదయం 9గంటల వరకు 8 శాతం ఓటింగ్ నమోదైంది. తాజా అప్‌డేట్ ప్రకారం, బాగ్‌పత్‌లో అత్యధికంగా 9% పోలింగ్ నమోదు కాగా, లోనిలో అత్యల్పంగా 7 .6శాతం ఓటింగ్ నమోదైంది.

  • 10 Feb 2022 09:56 AM (IST)

    ఉదయం 9 గంటల వరకు ఓటింగ్

    ఆగ్రా – 7.53 అలీఘర్ – 8.26 బాగ్‌పట్ – 8.93 మధుర – 8.30 ముజఫర్‌నగర్ – 7.50 షామ్లీ – 7.70 హాపూర్ – బులంద్‌షహర్ – 7.51 నోయిడా – 9 లోని – 7.60 మురాద్‌నగర్ – 8.40 సాహిబాబాద్ – 8.60 ఘజియాబాద్ – 8.20 మోడీనగర్ – 8.00 ధౌలానా (పాక్షికం) – 8.20

  • 10 Feb 2022 09:51 AM (IST)

    ఓటు వేసిన మంత్రి సురేష్ రాణా

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో రాష్ట్ర మంత్రి సురేష్ రాణా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షామ్లీలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా అందరూ ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  • 10 Feb 2022 09:43 AM (IST)

    నోయిడా ఓటు వేసిన డీఎం సుహాస్ ఎల్‌వై

    నోయిడా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ ఎల్‌వై తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గౌతమ్ బుద్ నగర్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో సుహాస్ ఓటు వేశారు. దీంతో పాటు ఓటర్లందరూ ఓట్లు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఓటు వేయడానికి పౌరులు బయటకు రావాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా మోడల్ పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామని, అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద పారామిలటరీ బలగాలను మోహరించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని వీడియోగ్రఫీ చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ బూత్‌ల వద్ద అన్ని కోవిడ్19 ప్రోటోకాల్‌లు అనుసరించి పోలింగ్ నిర్వహిస్తున్నామని సుహాస్ తెలిపారు.

  • 10 Feb 2022 09:39 AM (IST)

    మొదటి 2 గంటలు మందకొడిగా పోలింగ్..

    ఘజియాబాద్‌లో 8% పోలింగ్ నోయిడాలో 4% పోలింగ్ హాపూర్‌లో 8% పోలింగ్ ఆగ్రాలో 6 శాతం పోలింగ్ గౌతమ్ బుద్ధ నగర్‌లో 4 శాతం

  • 10 Feb 2022 09:32 AM (IST)

    మీ గురించి పట్టించుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకోండిః RLD చీఫ్ జయంత్

    శ్రద్ధ వహించే ఉత్తరప్రదేశ్‌లో ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు RLD చీఫ్ జయంత్ చౌదరి. తొలి విడత పోలింగ్‌తో తమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత జయంత్ చౌదరి విజ్ఞప్తి చేశారు. “ప్రతి ఒక్కరు మీ ఇండ్ల నుండి బయటకు వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థించారు. మీ గురించి పట్టించుకునే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. దయచేసి మీ చుట్టూ ఉన్న ప్రజలను కూడా అలాగే చేసేలా ప్రోత్సహించండి” అని ఆయన అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి అభ్యున్నతికి పాటుపడే బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదిక ఓటర్లను కోరారు.

  • 10 Feb 2022 09:25 AM (IST)

    ఓటేసిన బీజేపీ ఎంపీ రాజ్‌కుమార్ చాహర్

    బీజేపీ ఎంపీ రాజ్‌కుమార్ చాహర్ ఆగ్రాలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. కుటుంబసమేతంగా పోలింగ్ స్టేషన్ చేరుకున్న ఆయన తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 10 Feb 2022 09:23 AM (IST)

    హాపూర్‌లో 9 శాతం ఓటింగ్

    తొలి దశలో భాగంగా యూపీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హాపూర్‌లో ఉదయం 9 గంటల వరకు 9 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ అధికారులు తెలిపారు.

  • 10 Feb 2022 09:21 AM (IST)

    30 ఏళ్ల తర్వాత స్వంత బలంతో పోరాడుతున్నాం: ప్రియాంక గాంధీ

    మీ సమస్యల పరిష్కారానికి, భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఏఐసీసీ ప్రధాని కార్యదర్శి ప్రియాంక గాంధీ. 30 ఏళ్ల తర్వాత మేము మా స్వంత బలంతో అన్ని స్థానాల్లో పోరాడుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. యూపీ ప్రజలు మార్పు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు.

  • 10 Feb 2022 09:16 AM (IST)

    కైరానాలో పోలింగ్ ప్రశాంతం

    ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ స్థానాల్లో ఒకటైన కైరానా స్థానంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటేసిందుకు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు.

  • 10 Feb 2022 09:10 AM (IST)

    అలీఘర్‌లో 7 స్థానాలకు 60 మంది అభ్యర్థులు

    అలీఘర్‌ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. తొలి దశలో జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 60 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. అలీఘర్‌లో 27.65 లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయిస్తారు.

  • 10 Feb 2022 08:31 AM (IST)

    బయటకు రండి, ఓటు వేయండి: రాహుల్ గాంధీ

    దేశాన్ని అన్ని భయాల నుంచి విముక్తం చేస్తామని, ప్రతి ఒక్కరూ ప్రశాంతం వాతావరణంలో ఓటు వేయాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బయటకు రండి, ఓటు వేయండి. అంటూ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు.

  • 10 Feb 2022 08:29 AM (IST)

    ఘజియాబాద్‌లో కొనసాగుతున్న పోలింగ్

    ఘజియాబాద్‌లోనూ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేవీ నగర్ విధానసభ మురాద్‌నగర్‌లోని పోలింగ్ బూత్‌లో చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు క్యూ లైన్‌లో నిలిచి ఉన్నారు.

  • 10 Feb 2022 08:28 AM (IST)

    సరియైన నిర్ణయానికి ఇదే సమయంః మాయావతి

    యూపీ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికల కోసం పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈరోజు తొలి దశ ఓటింగ్‌లో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం అని మాజీ ముఖ్యమంత్రి మాయావతి ట్వీట్ ద్వారా తెలిపారు. యూపీలో రాబోయే ఐదేళ్లు మీకు మునుపటిలా దుఃఖంతో, నిస్సహాయతతో నిండిపోతాయా లేదా మిమ్మల్ని మీరు రక్షించుకోగలరా అని నిర్ణయించుకోవాల్సిన సమయం ఇది.

  • 10 Feb 2022 08:24 AM (IST)

    ఆగ్రలో ఓటేసిన బేబీ రాణి మౌర్య

    ఆగ్రా అర్భన్ ప్రాంతానికి చెందిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బేబీ రాణి మౌర్య అగ్రాలోని పోలింగ్‌ బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “రాష్ట్రంలో సుపరిపాలన కోసం పౌరులు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారని నాకు నమ్మకం ఉంది” అని బేబీ రాణి మౌర్య అన్నారు. ఆగ్రాలోని పోలింగ్ బూత్‌లో బిజెపి నాయకుడు ANI కి చెప్పారు

  • 10 Feb 2022 08:06 AM (IST)

    కుత్బీలో బారులు తీరిన ఓటర్లు

    ముజఫర్‌నగర్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ప్రజలు తమ వంతు కోసం వేచి ఉన్నారు. కుత్బీలోని ప్రీ-సెకండరీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు క్యూ లైన్‌లో బారులు తీరారు.

  • 10 Feb 2022 08:03 AM (IST)

    అలీఘర్‌లో 7 స్థానాల్లో 60 మంది అభ్యర్థులు

    అలీఘర్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తొలి దశలో 7 అసెంబ్లీ స్థానాల్లో 60 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. అలీఘర్‌లో 27.65 లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల గెలుపు, ఓటములను నిర్ణయిస్తారు.

  • 10 Feb 2022 07:43 AM (IST)

    తొలి దశలో 9 మంది మంత్రులు పోటీ

    యూపీలో తొలిదశ ఎన్నికల్లో యోగి ప్రభుత్వానికి చెందిన 9 మంది మంత్రులు బరిలో నిలిచారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 58 స్థానాలకు గాను 53 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.

  • 10 Feb 2022 07:39 AM (IST)

    మొదటి ఓటు తర్వాత రిఫ్రెష్‌మెంట్ః సీఎం యోగి ఆదిత్యనాథ్

    యూపీలో తొలి దశలో జరుగుతున్న పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేస్తూ, ‘ప్రజాస్వామ్యం గొప్ప త్యాగం మొదటి దశ ఇది. మీ అమూల్యమైన ఓటును వృధా చేయకుండా ఈ కర్మ పూర్తి కాదు. మీ ఒక్క ఓటు నేర రహిత, భయం లేని, అల్లర్లు లేని ఉత్తరప్రదేశ్ సంకల్పాన్ని బలపరుస్తుంది. అందుకే ‘మొదట ఓటేయండి, తర్వాత రిఫ్రెష్‌మెంట్’ తర్వాత ఏదైనా పని…’ అంటూ పేర్కొన్నారు.

  • 10 Feb 2022 07:23 AM (IST)

    కోవిడ్ నిబంధనల నడు పోలింగ్

    మూడవ వేవ్ భయంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం సమగ్ర కోవిడ్ మార్గదర్శకాలను రూపొందించింది.

  • 10 Feb 2022 07:22 AM (IST)

    కైరాన్‌లో బారులుతీరిన ఓటర్లు

    కైరానాలోని పబ్లిక్ ఇంటర్ కాలేజీలో – బూత్ నంబర్ 299 వద్ద ప్రజలు ఓటు వేసేందుకు భారీగా క్యూలు కట్టారు.

  • 10 Feb 2022 07:20 AM (IST)

    UPలోని 58 అసెంబ్లీ స్థానాలకు తొలి దశ పోలింగ్

    యూపీ అసెంబ్లీ ఎన్నికల 2022 తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాలు – షామ్లీ, మీరట్, హాపూర్, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, ఘజియాబాద్, బులంద్‌షహర్, అలీఘర్, ఆగ్రా, గౌతమ్ బుద్ధ నగర్ మరియు మథురలో ఓటింగ్ జరుగుతోంది.

Published On - Feb 10,2022 7:00 AM

Follow us