AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇలా ఉన్నారేంట్రా..! హీరోయిన్ చేసిన పని నెటిజన్స్ క్రేజీ రియాక్షన్..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రియేటివిటీ పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ తమలో ఉన్న క్రియేటివిటీని బయట పెడుతున్నారు.. రకరకాల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకూ ఆమె ఎవరు.? ఏం చేసిందంటే..

మరీ ఇలా ఉన్నారేంట్రా..! హీరోయిన్ చేసిన పని నెటిజన్స్ క్రేజీ రియాక్షన్..
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 29, 2025 | 10:27 AM

Share

సోషల్ మీడియాలో హీరోయిన్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమా అప్డేట్స్ తో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. కొంతమంది క్రేజీ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది మంది విహారయాత్రలకు వెళ్లి అక్కడి నుంచి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో తమ క్రియేటివిటీ చూపించడానికి కొంతమంది హీరోయిన్స్ చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్ చేసిన పని నెటిజన్స్ ను ఆకట్టుకుంది. ఆ అమ్మడు చేసిన పనికి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ ఏంటి తల్లి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ ఆమె ఏం చేసిందంటే..

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయమైంది అందాల భామ వర్ష బొల్లమ్మ. ఆతర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది. అలాగే దళపతి విజయ్ నటించిన విజిల్ లోనూ ఆకట్టుకుంది. దళపతి విజయ్ విజిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది వర్ష. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో తన క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తుంది.

కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజగా కొన్ని ఫోటోలు. వీడియోలు షేర్ చేసింది. ప్రస్తుతం విహారయాత్రలో బిజీగా ఉన్న ఈ భామ.. తాజాగా ఓ సింహం నోటి నుంచి నీళ్లు వస్తున్న ఓ ఫౌంటెన్ దగ్గర నిలబడి ఆ నీటితో తల స్నానం చేస్తున్నట్టు ఫన్నీగా చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సింహం ముందు కోతిపనులు చేస్తుందని కొందరు. ఎవ్వుర్రా నువ్వు మరీ ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్.? అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.