Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

May Flower: మే పుష్పం ముందే వికసించింది.. మన్యం గిరుల్లో పూసే ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా!

ఏడాదంతా ఈ పూలు కనిపించవు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే అతిథిలా ఆకర్షిస్తాయి. గుబురుగా బంతి ఆకారంలో ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ పూలు ఏడాదికి ఒకసారి మాత్రమే పూస్తాయి కాబట్టి వాటి రాక కోసం జనాలు ఎంతో ఆత్రుతగా వేచి చూస్తూ ఉంటారు. అవే మే ఫ్లవర్స్...!అల్లూరి జిల్లా ఏజెన్సీలో మే ఫ్లవర్స్ ఆకర్షిస్తూ ఉన్నాయి. గిరుల్లో కనువిందు చేస్తున్నాయి.

May Flower: మే పుష్పం ముందే వికసించింది.. మన్యం గిరుల్లో పూసే ఈ పుష్పాల ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా!
May Flower
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Anand T

Updated on: Apr 29, 2025 | 10:59 AM

అల్లూరి మన్యం గిరుల్లో ఈ అరుదైన పుష్పం ముందే పూచింది. చూడ చక్కటి వర్ణం, ఆకారంతో ఈ పూలు అందరినీ ఆకర్శిస్తున్నాయి.  తన ప్రత్యేక ఆకారంతో తెగ ముద్దొస్తున్నాయి. ఈ సీజన్లో ముందే అతిథిగా వచ్చిన ఆ పూలను అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.  అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో మే ఫ్లవర్స్ జనాలను కనువిందు చేస్తున్నాయి. ప్రతి ఏటా మే నెలలో పూచే ఈ పూలను మే ఫ్లవర్స్ అని పిలుస్తారు. ఏడాదంతా ఈ పూలు కనిపించవు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే అతిథిలా వచ్చి ఆకర్షిస్తాయి. గుబురుగా బంతి ఆకారంలో ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకట్టుకుంటాయి.

ఈ పూలు ఏడాదికి ఒకసారి మాత్రమే పూస్తాయి కాబట్టి వాటి రాక కోసం జనాలు ఎంతో ఆత్రుతగా వేచి చూస్తూ ఉంటారు. బంతి, చామంతి, గులాబి, కనకాంబరం, లిల్లి.. ఇలా ఎన్ని పూలు పెరట్లో పూచినా.. మే నెలలో పూచే ఈ అరుదైన పుష్పాల ఉంటే మాత్రం ఆ లుక్కే వేరు. కోవిడ్ తర్వాత ఈ పువ్వులు మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఎందుకంటే ఈ పూలను చూసిన చిన్నారులు సరదాగా కరోనా వైరస్ పువ్వులని పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ పూల ఆకారం. కొవిడ్ వైరస్ ఆకారంలో సరిపోలి ఉంటాయి. మే పూలు స్కాడొక్సస్ మల్టీ ఫ్లోరస్ జాతికి చెందినవి. ఇవి ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఆంధ్ర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. బ్లడ్ లిల్లీ, బాల్ లిల్లీ, ఫైర్ బాల్ లిల్లీ అని అనే పేర్లతో కూడా ఈ పూలను పిలుస్తుంటారు. భారతదేశంలో ఇక్కడి వాతావరణ పరిస్థితుల బట్టి మే నెలలో ఈ పుష్పం విరబూస్తూ ఉంటుంది. అందుకే దీనికి మే ఫ్లవర్ అని పిలుస్తుంటారు.

అయితే వాస్తవానికి మేలోనే ఈ పుష్పం విరబూయాల్సి ఉన్న… ఉష్ణోగ్రతలో వాతావరణ పరిస్థితులను బట్టి.. కొన్నిచోట్ల ఏప్రిల్ లోను మరి కొన్నిచోట్ల ఆలస్యంగా కూడా విరబూస్తూ ఉంటాయి. అయితే ఈ పూలు ఒకసారి వచ్చి వెళ్లిన తర్వాత మళ్లీ పలకరించేందుకు ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తుంది. అందుకే ఈ అరుదైన పుష్పం రాక కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..