AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు సర్య్కూలర్‌ జారీ!

RBI: ప్రజలకు తరచుగా ఉపయోగించే డినామినేషన్ నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి, అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (WLAOలు) వారి ATMలు కూడా క్రమం తప్పకుండా రూ.100, రూ.200 నోట్లు అందించే విధంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

RBI: రూ.100, 200 నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు సర్య్కూలర్‌ జారీ!
Subhash Goud
|

Updated on: Apr 29, 2025 | 10:43 AM

Share

దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూ.100, రూ.200 నోట్లకు సంబంధించి ఒక పెద్ద ఆర్డర్ జారీ చేసింది. రెండు నోట్లకు సంబంధించి ఆర్‌బిఐ జారీ చేసిన సూచనలను వీలైనంత త్వరగా అమలు చేయాలని బ్యాంకులను కోరింది. దీనికోసం ఆర్‌బిఐ అన్ని బ్యాంకులకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. 100, 200 రూపాయల నోట్లకు సంబంధించి RBI ఎలాంటి సర్క్యులర్ జారీ చేసిందో తెలుసుకుందాం.

బ్యాంకులకు ఆర్‌బిఐ ఆదేశాలు

ఏటీఎంలు కూడా రూ.100, రూ.200 నోట్లను పంపిణీ చేసేలా చూసుకోవాలని సోమవారం బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. ప్రజలకు ఈ నోట్ల లభ్యతను పెంచడానికి అలా చేయడం అవసరమని కేంద్ర బ్యాంకు తెలిపింది. బ్యాంకులు, వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు (WLAOలు) ఈ ఆదేశాలను దశలవారీగా అమలు చేయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ కాని సంస్థలు నిర్వహించే ATMలను ‘వైట్ లేబుల్ ATMలు’ (WLA) అంటారు. ఇప్పుడు అన్ని బ్యాంకులు రూ.100, .200 నోట్ల విషయంలో ATMలలో మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.

ప్రజలకు తరచుగా ఉపయోగించే డినామినేషన్ నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి, అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు (WLAOలు) వారి ATMలు కూడా క్రమం తప్పకుండా రూ.100, రూ.200 నోట్లు అందించే విధంగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక సర్క్యులర్‌లో తెలిపింది. ఆ సర్క్యులర్ ప్రకారం, సెప్టెంబర్ 30, 2025 నాటికి, 75 శాతం ఏటీఎంలు (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లు) కనీసం ఒక క్యాసెట్‌ను రూ.100 లేదా రూ. 200 డినామినేషన్ బ్యాంక్ నోట్లను అందించాలని తెలిపింది.

దీని తరువాత మార్చి 31, 2026 నాటికి, 90 శాతం ఏటీఎంలు కనీసం ఒక క్యాసెట్ నుండి రూ. 100 లేదా రూ. 200 డినామినేషన్ గల బ్యాంక్ నోట్లను అందించాలని తెలిపింది. ప్రజల్లో ఈ నోట్లను ఎక్కువ మొత్తంలో వాడకం ఉండేలా చూడాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆయా బ్యాంకులను కోరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..