TSRTC MD Sajjanar: పాటతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఆర్టీసీ డ్రైవ‌ర్.. సజ్జనార్ ట్వీట్ చేసి ఏమన్నారంటే..? వీడియో

TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి.. మార్పు స్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల

TSRTC MD Sajjanar: పాటతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్న ఆర్టీసీ డ్రైవ‌ర్.. సజ్జనార్ ట్వీట్ చేసి ఏమన్నారంటే..? వీడియో
Bus Driver
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 15, 2021 | 3:24 PM

TSRTC MD Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి.. మార్పు స్పష్టంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యలపై సజ్జనార్ స్వయంగా స్పందిస్తూ.. వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు పలు సంస్కరణలకు వీసీ సజ్జనార్ నాంది పలికారు. ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. శుభకార్యాలు, పలు ప్రదేశాలకు ఆర్టీసీ బస్‌ను బుక్‌ చేసుకునే వారు ముందస్తు అడ్వాన్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా చేశారు. అంతేకాకుండా పెళ్లిళ్లకు ఆర్టీసీ బస్‌ను బుక్‌ చేసుకుంటే.. నూతన వధూవరులకు కానుకలు అందిస్తున్నారు. బాలల దినోత్సవం సందర్భంగా 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఆర్టీసీ బ‌స్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు, ప్రయాణికులను ఆక‌ట్టుకునేందుకు సజ్జనార్‌.. ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు.

ఆర్టీసీ బ‌స్సుల్లో ప్రయాణించేలా ప్రజలకు అవగాహ‌న క‌ల్పిస్తున్నారు. అంతేకాకుండా ట్విట్టర్‌ వేదికగా.. స్పందిస్తూ సజ్జనార్‌ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా నాగ‌ర్‌క‌ర్నూల్ డిపోకు చెందిన డ్రైవ‌ర్ శాంత‌య్య.. పాట పాడిన వీడియోను వీసీ సజ్జనార్‌ షేర్‌ చేశారు. శాంతయ్య పాట పాడి ప్రయాణికులను ఆకట్టుకున్నారు. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండ‌ల ప‌రిధిలోని నాయినిప‌ల్లి మైస‌మ్మ ఆల‌యంలో ప్రతి ఆదివారం జాతర జరుగుతుంది. మైసమ్మను దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు త‌ర‌లివ‌స్తారు. దీంతో నాగ‌ర్‌క‌ర్నూల్‌, కొల్లాపూర్, వ‌న‌ప‌ర్తి డిపోల నుంచి ఈ ఆల‌యానికి ప్రత్యేక బ‌స్సు సర్వీసుల‌ను న‌డిపిస్తారు.

వీడియో.. 

దీనిలో భాగంగా ఆదివారం.. నాగ‌ర్‌క‌ర్నూల్ డిపోకు చెందిన డ్రైవ‌ర్ శాంతయ్య.. మైస‌మ్మ జాత‌ర‌కు వ‌చ్చే ప్రయాణికులను ఆక‌ర్షించేందుకు పాట‌ పాడి మైమరిపించారు. మైస‌మ్మ దేవ‌త ప్రాశస్త్యాన్ని వివరిస్తూ.. శాంతయ్య పాట‌ను ఆల‌పించారు. ఆర్టీసీ బ‌స్సుల్లో ప్రయాణం.. సురక్షితమంటూ ప్రయాణికులకు వివరించారు. అయితే.. డ్రైవ‌ర్ పాడిన పాట వీడియోను.. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ త‌న ట్విట‌ర్ ఖాతాలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి.. ప్రయాణికులతోపాటు.. ఉద్యోగులను కూడా సజ్జనార్ ప్రోత్సహిస్తూ.. సంస్థ అభివృద్ధి తొడ్పడుతున్నారంటూ.. పలువురు ప్రశంసిస్తున్నారు.

Also Read:

Dance Video Viral: టాలెంట్‌ఏ ఒక్కరి సొంతం కాదు.. ముగ్గురు చిన్నారుల డ్యాన్స్‌కు బాహుబలి భామ ఫిదా.. వీడియో వైరల్

Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఈ నెల ద్వితీయార్థంలో బ్యాంకు సెలవులు ఇవే..