AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC: ఆర్‌టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ‘టీ-9 టికెట్‌’ సమయాల్లో మార్పులు.. పూర్తి వివరాలివే..

TSRTC on T9 Ticket: గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన 'టి-9 టికెట్‌' సమయాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి..

TSRTC: ఆర్‌టీసీ ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ‘టీ-9 టికెట్‌’ సమయాల్లో మార్పులు.. పూర్తి వివరాలివే..
TSRTC T-9 Ticket
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 07, 2023 | 8:35 PM

Share

TSRTC on T9 Ticket: గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘టి-9 టికెట్‌’ సమయాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) మార్పులు చేసింది. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ టికెట్‌ చెల్లుబాటు అయ్యేది. ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ టికెట్‌ను సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పెంచుతూ సంస్థ నిర్ణయం తీసుకుంది. టి-9 టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. రూ.100 చెల్లించి ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన ప్రయాణికులు.. తిరుగుప్రయాణంలో రూ.20 కాంబీ టికెట్‌తో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. తిరుగుప్రయాణంలో మాత్రమే ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.20 కాంబీ టికెట్‌ వర్తిస్తుంది. టి-9 టికెట్‌ సవరణ సమయాలు, రూ.20 కాంబి టికెట్‌ ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది.

Untitled 5

‘‘పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం టి-9 టికెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ టికెట్‌తో రూ.100 చెల్లించి 60 కి.మీ పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయవచ్చు. జూన్‌ 18న అందుబాటులోకి తెచ్చిన ఈ టికెట్‌కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 11 వేల మంది ఈ టికెట్‌ను కొనుగోలు చేశారు. టి-9 టికెట్‌ సమయాలను సవరించాలని సంస్థ దృష్టికి కొందరు ప్రయాణికులు తీసుకువచ్చారు. ఈ అభ్యర్థలను పరిశీలించిన తర్వాత ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయాన్ని సంస్థ పెంచింది. తిరుగు ప్రయాణంలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ప్రయాణించేందుకు గాను కొత్తగా రూ.20తో కాంబీ టికెట్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ టికెట్‌ ద్వారా ఒక్కొక్కరికీ రూ.20 నుంచి రూ.40 ఆదా అవుతుంది. ఈ టికెట్‌ను మహిళలు, సీనియర్‌ సిటిజన్స్‌ కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఆర్‌టీసీ సంస్థను ఆదరించాలి’’ అంటూ టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ కోరారు.

ఇవి కూడా చదవండి

ఇంకా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోండగా.. తొలిసారిగా గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రయాణికుల సౌకర్యార్థం టి-9 టికెట్ ను సంస్థ అందుబాటులోకి తెచ్చిందని వారు తెలిపారు. ఈ టికెట్ల పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033 లను సంప్రదించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.