Asia Cup 2023: ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఆ యువ ఆటగాడికి సారథ్య బాధ్యతలు..

ACC Emerging Teams Asia Cup 2023: శ్రీలంకలోని కొలంబో వేదికగా ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీ జూలై 13 నుంచి జూలై 23 వరకు జరగనుంది. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన భారత ఏ జట్టును..

Asia Cup 2023: ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఆ యువ ఆటగాడికి సారథ్య బాధ్యతలు..
India A squad for ACC Men’s Emerging Teams Asia Cup 2023
Follow us

|

Updated on: Jul 04, 2023 | 9:42 PM

ACC Emerging Teams Asia Cup 2023: శ్రీలంకలోని కొలంబో వేదికగా ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2023 టోర్నీ జూలై 13 నుంచి జూలై 23 వరకు జరగనుంది. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన భారత ఏ జట్టును ప్రటించింది. 2022 అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపిన యష్ ధుల్ ఈ జట్టుకు కూడా నాయకత్వం వహిస్తుండగా, అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇంకా గుజరాత్ టైటాన్స్‌ తరఫున ఐపీఎల్ 2023 ఫైనల్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సాయి సుదర్శన్ కూడా ఈ జట్టులో అవకాశం ఫొందాడు. వీరితో పాటు రియాన్ పరాగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ధ్రువ్ జురెల్ వంటి ఐపీఎల్ ప్లేయర్లు కూడా ఉన్నారు. బౌలర్లుగా  గత సీజన్ రంజీ ట్రోఫీలో ఆకట్టుకున్న మానవ్ సుథర్, యువరాజ్‌సిన్హ్ దోడియా ఎంపికయ్యాడు.

ఇక టోర్నీ గ్రూప్ ఏలో శ్రీలంక ఏ, బంగ్లాదేశ్ ఏ, ఆఫ్ఘానిస్తాన్ ఏ, ఓమన్ ఏ ఉండగా..  భారత్ ఏ, నేపాల్ ఏ, యూఏఈ ఏ, పాకిస్థాన్ ఏ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి గ్రూప్‌లో టాప్ 2 జట్లు సెమీస్‌కి చేరుకుంటాయి. అలాగే రెండు సెమీఫైనల్స్ కూడా జూలై 21న.. టోర్నీ ఫైనల్ 23న జరుగుతాయి. ఇదిలా ఉండగా భారత్ ఏ జట్టు టోర్నీలో తన తొలి మ్యాచ్‌ 13న యూఏఈ ఏ జట్టుతో ఆడుతుంది. అలాగే జూలై 15న పాకిస్థాన్ ఏ, జూలై 18న నేపాల్ ఏ జట్లతో తలపడుతుంది.

ఇవి కూడా చదవండి

భారత ఏ జట్టు: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ(వికెట్ కీపర్), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, యష్ ధుల్(సి), రియాన్ పరాగ్, నిశాంత్ సింధు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, యువరాజ్‌సింగ్ దోడియా, హర్షిత్ రాణా, ఆకాష్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, రాజవర్ధన్ హంగర్గేకర్.

స్టాండ్‌బై ప్లేయర్స్: హర్ష్ దూబే, నెహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రెడ్కర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
ఇంట్లో బల్లుల బెడద..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా తరిమికొట్టండి..
అబ్బ.. చలచల్లని వార్త.. వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
అబ్బ.. చలచల్లని వార్త.. వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
కల్కి సినిమాపై బన్నీ రియాక్షన్.. ప్రభాస్ గురించి ఏమన్నారంటే..
కల్కి సినిమాపై బన్నీ రియాక్షన్.. ప్రభాస్ గురించి ఏమన్నారంటే..