IND Vs WI: ఒక్కప్పుడు కోహ్లీ ప్లేస్.! కట్ చేస్తే.. ఇప్పుడు ఆ ముగ్గురిలో ఎవరిది.? ప్లేయర్స్ ఎవరంటే..

ఒక డబ్ల్యూటీసీ సైకిల్ పూర్తయింది.. ఇప్పుడు మరొకటి ప్రారంభం కానుంది. ఈసారి పెను మార్పులతో బరిలోకి దిగినేందుకు టీమిండియా సిద్దమయ్యింది.

IND Vs WI: ఒక్కప్పుడు కోహ్లీ ప్లేస్.! కట్ చేస్తే.. ఇప్పుడు ఆ ముగ్గురిలో ఎవరిది.? ప్లేయర్స్ ఎవరంటే..
Team India Test
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 04, 2023 | 6:27 PM

ఒక డబ్ల్యూటీసీ సైకిల్ పూర్తయింది.. ఇప్పుడు మరొకటి ప్రారంభం కానుంది. ఈసారి పెను మార్పులతో బరిలోకి దిగినేందుకు టీమిండియా సిద్దమయ్యింది. జూలై 12 నుంచి విండీస్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ మొదలవుతుంది. ఈ సమయంలో భారత టీమ్ మేనేజ్‌మెంట్ పలువురు యువ ప్లేయర్స్‌కు అవకాశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ టెస్టు సిరీస్‌కు సీనియర్ ప్లేయర్ పుజారాను తప్పించి.. యువ ఆటగాళ్లైన రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్‌కు చోటు కల్పించారు సెలెక్టర్లు. వీరిద్దరిలో ఎవరు మూడో స్థానంలో దిగుతారన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్.

మొదటి టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్లుగా గిల్, రోహిత్ శర్మ దిగుతుండగా.. మూడో స్థానం కోసం రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ మధ్య పోటీ నెలకొంది. ఒకవేళ యశస్వి జైస్వాల్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటే.. ఓపెనర్‌గా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ప్రకారం.. ఆ సమయంలో గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగొచ్చు. లేదా.. గిల్‌ను ఓపెనర్‌గానే ఉంచి.. రుతురాజ్‌ను వన్‌ డౌన్‌లో బరిలోకి దింపే అవకాశం ఉంది. ఇప్పుడు వీరి ముగ్గురు కాంబినేషనే టీం మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక మిడిలార్డర్‌లో విరాట్ కోహ్లీ, అజింక్య రహనే కొండంత బలంగా ఉండనే ఉన్నారు.

భారత్ జట్టు(తొలి టెస్టుకు అంచనా):

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్/రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్/కెఎస్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్/జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్