‘ప్రజల మాదిరిగా నేనూ మోసపోయా, మీ భిక్షతో రాజకీయాల్లోకి రాలేదు’.. బీఆర్ఎస్‌పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు..

Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్ నేతల మాటలను నమ్మి ఆ పార్టీలో చేరానని, ప్రజల్లాగానే తానూ మోసపోయానని, లేకపోతే ఆ నాడే వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యేవాడినని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్..

‘ప్రజల మాదిరిగా నేనూ మోసపోయా, మీ భిక్షతో రాజకీయాల్లోకి రాలేదు’.. బీఆర్ఎస్‌పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు..
Ponguleti Srinivasa Reddy
Follow us

|

Updated on: Jul 04, 2023 | 9:15 PM

Ponguleti Srinivasa Reddy Exclusive Interview: బీఆర్ఎస్ నేతల మాటలను నమ్మి ఆ పార్టీలో చేరానని, ప్రజల్లాగానే తానూ మోసపోయానని, లేకపోతే ఆ నాడే వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యేవాడినని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ పార్టీలో తన చేరిక గురించి వివరించారు. వైసీపీ నుంచి తాను ఎంపీగా గెలిచిన తన చుట్టూ రాష్ట్ర విభజన జరిగిన 2 రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ నేతలు తిరిగితేనే తాను వాళ్ల పార్టీలో చేరానని, ఇక్కడ వైసీపీ లేకపోవడంతోనే చేరానని పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన తనను బీఆర్ఎస్ నేతలు పదేపదే బతిమాలితేనే వారి మాటలు నమ్మి చేరానని, కానీ ప్రజలు నమ్మి మోసపోయినట్లుగానే తాను మోసపోయానని ఆయన వివరించారు.

అలాగే ‘మేము వద్దని వెళ్లగొట్టినవాళ్లనే మీరు తీసుకుంటున్నారు. మాకు పీడ పోయింది’ అంటూ జూన్ 30న మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై టీవీ9 వేదికగా పొంగులేటి స్పందిచారు. ‘శని మీకు పోయిందా, తగులించుకున్నారా.? అనేది కొన్ని నెలల్లోనే తేలుతుంద’న్నారు. ఇంకా ‘పొంగులేటి, జూపల్లిని సస్పెండ్ చేసింది మేము. ఇక్కడ స్పేస్ లేదని వదిలించుకుంటేనే కాంగ్రెస్ వీళ్లని తీసుకుంది’ అంటూ జూన్ 27న టీవీ9 కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీర్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ‘మీరు ప్రాధేయ పడి అడిగితే మీ పార్టీలోకి వచ్చాం. మీరు గెలిపిస్తే ప్రజాప్రతినిథిని కాలేదు. మీ భిక్షతో రాజకీయాల్లోకి రాలేదు. స్పేస్ లేదని సస్పెండ్ చేయాలని మీరు మోసం చేయాలనే మీ పార్టీలోకి తీసుకున్నారా కేటీఆర్..?’ అంటూ మంత్రిని పొంగులేటి ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Latest Articles
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
మ్యాచ్‌లో ఉత్కంఠ క్షణాలు మిస్సయ్యారా.. ఈ హైలైట్స్‌ వీడియో చూడండి
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
ఏం తినేటట్టు లేదు.. కొండెక్కిన కూరగాయల ధరలు.. దిగిరానంటూ మారాం..!
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
400 ఆలయాలతో పేర్చినట్లు ఉండే గ్రామం ఎక్కడో తెలుసా?
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
అర్జునుడి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఏంతంటే..
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
పాలతో అందం పదిలం.. మచ్చలేని మెరిసే చర్మం కోసం ఇలా ట్రై చేయండి..!
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: టీమిండియా క్రికెటర్లతో ప్రధాని
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రిపోర్టే కీలకం.. పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
రాత్రి పడుకునే ముందు కాళ్లు కడిగితే ఏమవుతుందో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
టాలీవుడ్‌లోనే ఫేమస్ సింగర్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?