Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Bharat 4G Phone: 999 రూపాలయలకే జీయో 4జీ ఫోన్.. ‘2జీ రహిత భారత్’తో పాటు ఆ 25 కోట్ల మందే లక్ష్యం..

Jio Bharat V2 4G: భారత మార్కెట్‌లో రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. దేశంలో ఇంకా 2జీ ముబైల్స్‌నే ఉపయోగిస్తున్న దాదాపు 25 కోట్ల వినియోగదారులే లక్ష్యంగా 4జీ కనెక్టివిటీ కలిగిన కీపాడ్ ముబైల్‌ని సోమవారం రిలియన్స్ జీయో విడుదల చేసింది. జియో భారత్ వీ2 4జీ..

Jio Bharat 4G Phone: 999 రూపాలయలకే జీయో 4జీ ఫోన్.. ‘2జీ రహిత భారత్’తో పాటు ఆ 25 కోట్ల మందే లక్ష్యం..
Jio Bharat V2 4G
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 03, 2023 | 9:29 PM

Jio Bharat V2 4G: భారత మార్కెట్‌లో రిలయన్స్ జియో మరో సంచలనం సృష్టించింది. దేశంలో ఇంకా 2జీ ముబైల్స్‌నే ఉపయోగిస్తున్న దాదాపు 25 కోట్ల వినియోగదారులే లక్ష్యంగా 4జీ కనెక్టివిటీ కలిగిన కీపాడ్ ముబైల్‌ని సోమవారం రిలియన్స్ జీయో విడుదల చేసింది. ‘జియో భారత్ వీ2 4జీ’ అనే పేరుతో లాంచ్ అయిన ఈ ముబైల్‌ని కేవలం 999 రూపాయలకే అందించనుండడం మరో విశేషం. ఇక ఇప్పటివరకు మనదేశంలో 4జీ ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన ఫోన్లలో అత్యంత చవకైన ముబైల్ ఇదే. రెడ్, బ్లూ కలర్ ఆప్షన్లతో వస్తున్న ఈ ఫోన్‌ బీటా ట్రయల్ జులై 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు మొదటి విడతగా 10 లక్షల ఫోన్లను తయారు చేసి, దేశవ్యాప్తంగా 6500 ప్రాంతాల్లో బీటా ట్రయల్స్ నిర్వహించనుంది రిలయన్స్ జియో.

Jio Bharat V2 4G ఫీచర్లు: రిలయన్స్ జియో  రిలీజ్ చేసిన ఈ జియో భారత్ వీ2 4జీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇంకా తెలియరాలేదు. కానీ ఇది జియో సినిమా, జియో సావన్ వంటి జియో యాప్స్‌‌తో పాటు ఎఫ్ఎం రేడియోకి ఇది సపోర్ట్ చేస్తుంది. అంతేకాక యూపీఐ పేమెంట్స్ చేసుకునేందుకు  కావాల్సిన ఫీచర్ కూడా ఈ జియో ఫోన్‌లో ఉండనుందని సమాచారం. ఇంకా ఇందులో 4.5 cm టీఎఫ్‌టీ స్క్రీన్‌, 0.3MP కెమెరా, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, టార్చ్‌, 1000mAh బ్యాటరీ బ్యాకప్ ఉంటాయని తెలుస్తోంది.

Jio Bharat V2 4G ప్లాన్లు: కొత్త 4జీ ఫోన్‌ని లాంచింగ్ చేసిన రోజునే రిలయన్స్ జియో దాని కోసం 4జీ ప్లాన్లను కూడా ప్రకటించింది. రూ.123 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు ప్రతి రోజూ 500ఎంబీ మొబైల్ డేటా,  అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. 1,234 రూపాయల వార్షిక ప్లాన్‌తో రిచార్జ్ చేసినా ఇవే ప్రయోజనాలను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..