Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus 5G Mobiles: వన్‌ప్లస్ నుంచి మరో బబ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఈ వారంలోనే విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

OnePlus Nord 3 5G: భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి పేరున్న వన్ ప్లస్ తన కస్టమర్ల కోసం మరో ఫోన్‌ను విడుదల చ చేయబోతుంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్‌ బడ్జెట్ ధరలో జూలై 5న విడుదల కానుంది. ఇక మునుపటి సిరీస్‌తో పోలిస్తే..

OnePlus 5G Mobiles: వన్‌ప్లస్ నుంచి మరో బబ్జెట్ స్మార్ట్‌ఫోన్.. ఈ వారంలోనే విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
OnePlus Nord 3 5G
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 03, 2023 | 7:08 PM

OnePlus Nord 3 5G: భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి పేరున్న వన్ ప్లస్ తన కస్టమర్ల కోసం మరో ఫోన్‌ను విడుదల చ చేయబోతుంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్‌ బడ్జెట్ ధరలో జూలై 5న విడుదల కానుంది. ఇక మునుపటి సిరీస్‌తో పోలిస్తే, OnePlus Nord 3 స్మార్ట్‌ఫోన్ చాలా అప్‌డేట్‌గా, ఆకర్షణీయమైన ఫీచర్లతో రానుందని తెలుస్తోంది. ట్రిపుల్ కెమెర్ సెట్‌అప్, సుదీర్ఘకాలం వచ్చే బ్యాటరీ బ్యాకప్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

జూలై 5 నుంచి వన్‌ప్లస్, అమెజాన్‌ వెబ్‌సైట్లలో అమ్మకానికి రాబోతున్న OnePlus Nord 3 ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా ఉంది. 64 మెగాపిక్సెల్‌ కలిగిన ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అలాగే 2-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఇవే కాక సోనీ సెన్సార్, LED ఫ్లాష్‌ని కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. అలాగే ముందు భాగంలో వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫోన్ కుడి వైపున అలర్ట్ స్లైడర్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే, 1080 x 2400 పిక్సెల్‌ స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED ఫుల్ HD+ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ఇంకా ఇది శక్తివంతమైన MediaTek DiamondCity 900 SoC ప్రాసెసర్‌తో రన్ అవుతుంది, అలాగే Android 13 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. ఇందులో  ఇన్‌స్టాల్ చేయబడింది. కూడా ఉంటుంది. ఇక ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 5000 బ్యాటరీ బ్యాకప్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సప్పోర్ట్, కనెక్టివిటీ ఎంపికలలో 5G సపోర్ట్, హాట్‌స్పాట్, బ్లూటూత్ 5.1, Wi-Fi, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. కాగా, ఫోన్ 8GB RAM + 128GB, 16GB RAM + 256GB వేరియంట్‌లో రానుంది. ఇందులోని మొదటి వేరియంట్ ధర రూ. 32,999, రెండో వేరియంట్ మోడల్ ధర రూ. 36,999 గా ఉంటుందని తెలుస్తోంది. విశేషమేమిటంటే 16జీబీ ర్యామ్‌తో వచ్చిన తొలి వన్‌ప్లస్ నార్డ్ ముబైల్ ఇదే.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెన్నికల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..