PM Modi Warangal Tour: తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన ప్రధాని మోదీ పర్యటన.. బాబోయ్ అవి మాటలా తూటాలా!
మోదీ వరంగల్ టూర్.. తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. విభజన హామీలను పరిష్కరించనందుకు ప్రధాని టూర్‌ను బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటిస్తే.. తెలంగాణ ప్రజలే బీఆర్‌ఎస్‌ను బహిష్కరిస్తారంటూ కేంద్ర మంత్రి కిషన్‌ర ఎడ్డి కౌంటర్ ఇచ్చారు.

మోదీ వరంగల్ టూర్.. తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. విభజన హామీలను పరిష్కరించనందుకు ప్రధాని టూర్‌ను బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటిస్తే.. తెలంగాణ ప్రజలే బీఆర్‌ఎస్‌ను బహిష్కరిస్తారంటూ కేంద్ర మంత్రి కిషన్‌ర ఎడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక తామేం తక్కువ అంటూ కాంగ్రెస్ నేతలు సైతం తమదైన శైలిలో అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. మరి మోదీ టూర్‌పై నేతల మాటల మంటలు ఎలా ఉన్నాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ టూర్ పొలిటికల్ వార్‌కు వేదికగా మారింది. మరోవైపు పీఎం వరంగల్ టూర్‌ను రాష్ట్ర బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్షలాది మందితో సభను సక్సెస్ చేయాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా టీబీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డితో పాటు ముఖ్యనేతలంతా వరంగల్‌లోనే మకాం వేశారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మాత్రం మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చలేదనే కారణంగా తాము ప్రధాని మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాము ప్రధాని మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆది నుంచి తెలంగాణ రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు బహిష్కరణతో తమ నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన ప్రధాని మోదీ.. ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్. మోదీ టూర్‌ని బీఆర్‌ఎస్ బహిష్కరిస్తుందన్నారు.
ఈ కామెంట్స్‌కు బీజేపీ నుంచి అంతే స్ట్రాంగ్ రిప్లై వచ్చింది. తెలంగాణ ప్రజలే బీఆర్‌ఎస్‌ను బహిష్కరిస్తారంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీ నెరవేర్చనందుకు బీఆర్‌ఎస్‌ను బహిష్కరిస్తారన్నారు. ఎవరికి కథలు నేర్పుతున్నావ్ అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు కిషన్ రెడ్డి.




బీ టీమ్ ప్రచారం..
ఇదిలాఉంటే.. తెలంగాణ రాజకీయాల్లో బీ టీమ్ పదం కాకరేపుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని గ్రహించిన పార్టీలు.. ముందునుంచే అలర్ట్ అయ్యాయి. ఇందులో భాగంగానే తమ ప్రత్యర్థి పక్షాలు రెండూ ఒక్కటేననే ప్రచారం చేస్తున్నాయి. ఈ అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీకి బీఆర్‌ఎస్ పార్టీ బీ టీమ్ అని ఆరోపిస్తూ కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ బీజేపీకీ బీ టీమ్ అని కాంగ్రెస్.. లేదు లేదు కాంగ్రెస్ కే బీఆర్ఎస్ బీ టీమ్ అని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నేతలు, బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీలో రహస్యంగా కలుస్తున్నారని తరుణ్ చుగ్ ఆరోపించారు.
మరోవైపు బీజేపీ- బీఆర్ఎస్ ఒక్కటేనంటోంది కాంగ్రెస్. విభజన హామీలపై ప్రశ్నించకుండా పరస్పరం రాజకీయ ప్రయోజనాల కోసం ఇద్దరూ పనిచేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.
మరోవైపు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాషాయం పార్టీ భారీ మార్పులకు, చేర్పులకు దిగుతోంది. తెలంగాణకు మరో ఇద్దరు సీనియర్ నేతలను అపాయింట్ చేసింది. తెలంగాణ ఇన్‌చార్జ్‌గా మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆయనకు సహాయకుడిగా..సునీల్ బన్సల్‌ను నియమించారు. మరోవైపు మోదీ వరంగల్ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. దీంతో మోదీ టూర్ రాజకీయంగా కాక రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
