TSRTC Ticket Price: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్.. 

Baji Reddy Goverdhan: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెలంగాణ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పదని

TSRTC Ticket Price: తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై క్లారిటీ ఇచ్చిన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్.. 
Baji Reddy Goverdhan
Follow us

|

Updated on: Nov 30, 2021 | 11:11 AM

Baji Reddy Goverdhan: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై తెలంగాణ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పదని పేర్కొన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో బస్ డిపోలను ఎత్తివేస్తున్నారన్న వార్తలను గోవర్ధన్ ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలను.. ఉద్యోగుల అవసరాన్ని బట్టి పలు డిపోలకు అడ్జెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. చార్జీల పెంపుపై రేపు మరోసారి సీఎం కేసీఆర్‌తో భేటీ ఉందని.. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు బాజిరెడ్డి గోవర్ధరన్ పేర్కొన్నారు. ఈ భేటీలో సీఎం కేసీఆర్ ఛార్జీలపై నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. తెలంగాణలో ఆర్టీసీలో ఛార్జీలు పెంచినా.. పక్క రాష్ట్రాలతో పోల్చితే తక్కువగానే ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డీపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలను నిర్వహించారు. దీనిలో భాగంగా హైదరాబాద్ జేబీఎస్ బస్ స్టేషన్లో నిర్వహించిన రక్త దాన శిబిరాన్ని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా టీవీ9తో బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేకంగా మాట్లాడారు.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మంది రక్తం దొరక్క ఇబ్బందులు పడినట్లు పేర్కొ్న్నారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా టీఎస్ ఆర్టీసీ అధ్వర్యంలో ఈ క్యాంప్ ఎర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, ప్రజలు స్వచ్ఛందంగా పెద్దఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్త దానం చేసిన వారికి సర్టిఫికేట్ అందజేశారు.

Also Read:

Hyderabad: బంగారం అక్రమ రవాణా.. హైదరాబాద్ నగల వ్యాపారిని అరెస్టు చేసిన ఈడీ

Crime News: చపాతీలు చేయనన్నందుకు యువకుడి హత్య.. దారుణంగా గొంతుకోసి..