TSPSC Paper Leak Case: 100 మార్కులు ఎలా వచ్చాయి.. గతంలో మార్కులెన్ని..? పేపర్ లీక్స్‌పై భిన్న రీతిలో సిట్ విచారణ

మీకు 100 మార్కులు ఎలా దాటాయి? గతంలో రాసిన పరీక్షల్లో వచ్చిన మార్కులెన్ని? అంటూ సిట్‌ భిన్న రీతిలో విచారణ చేస్తోంది. దీంతో ఆ అభ్యర్థులు సిట్‌ ఆఫీస్‌కు వచ్చారు.

TSPSC Paper Leak Case: 100 మార్కులు ఎలా వచ్చాయి.. గతంలో మార్కులెన్ని..? పేపర్ లీక్స్‌పై భిన్న రీతిలో సిట్ విచారణ
TSPSC
Follow us

|

Updated on: Mar 27, 2023 | 8:54 AM

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. లీక్‌కు సంబంధించి అంతు తేల్చే పనిలో ఉన్న అధికారులు.. అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఎక్కువ మార్కులు సాధించిన వారిని టార్గెట్ చేస్తూ.. నిందితులతో ఏవైన లింక్‌లు ఉన్నాయా అని కూపీ లాగుతున్నారు. గ్రూప్స్ పరీక్షలో 100 పైగా మార్కులు వచ్చిన వారి లిస్ట్ ఔట్ చేసింది. సిట్ కార్యాలయానికి వచ్చి 15 అంశాలతో కూడిన ప్రొఫార్మ నింపాలని సూచిస్తోంది. TSPSC బోర్డ్ నుంచి అభ్యర్థుల సమాచారం స్వీకరించి ఆఫీస్‌కు రావాలని సిట్ చెప్తోంది. ఆయా అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తోంది. అభ్యర్థి బయోడేటాతో పాటు ఎడ్యుకేషన్, జాబ్ ఆర్ స్టడీ, వివరాలు రికార్డ్ చేస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని పరీక్షలు రాశారు? ఎన్ని మార్కులు వచ్చాయని ఆరా తీస్తోంది. UPSC పరీక్షలు రాసిన వారి సమాచారం సేకరిస్తోంది. అవసరమైతే తిరిగి మళ్లీ కాంటాక్ట్ చేస్తామని అభ్యర్థులకు సూచిస్తోంది సిట్.

కాగా.. ఆదివారం సిట్ కార్యాలయంలో నలుగురు నిందితులను విచారించారు అధికారులు. ఇప్పటికే 40 మందికి పైగా అభ్యర్థులను విచారించి సిట్.. ఈ నలుగురు నిందితులతో ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయంపై ఆరా తీసింది. సిట్‌ ఆఫీస్‌ నుంచి వచ్చిన సూచన మేరకు.. ఇక్కడ వచ్చి తమ వివరాలు ఇచ్చామని అభ్యర్థులు చెప్తున్నారు. ఆ నలుగురితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కమిషన్ ఇంటా, బయట రచ్చ రాజేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..