AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది.. బీఆర్ఎస్ నాయకులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన..

బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను తెలుసుకోని మాట్లాడితే బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వజమెత్తారు. SDRF ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర శాఖలను ఆదేశించిన తర్వాత, కూడా తెలంగాణ ప్రభుత్వం మోడీ ప్రభుత్వంపై నిందలు వేస్తోందంటూ మండిపడ్డారు.

Kishan Reddy: వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది.. బీఆర్ఎస్ నాయకులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన..
Minister Kishan Reddy
Shaik Madar Saheb
|

Updated on: Mar 27, 2023 | 12:27 PM

Share

బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలను తెలుసుకోని మాట్లాడితే బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వజమెత్తారు. SDRF ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర శాఖలను ఆదేశించిన తర్వాత, కూడా తెలంగాణ ప్రభుత్వం మోడీ ప్రభుత్వంపై నిందలు వేస్తోందంటూ మండిపడ్డారు. SDRFకి భారత ప్రభుత్వ సహకారం 75%.. ఇది నిజం కాదని చెప్పగలరా అంటూ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ఒకవైపు, భారత ప్రభుత్వాన్ని నిందిస్తూనే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి (SDRF) రైతులకు నష్టపరిహారం అందించాలని కేసీఆర్ ప్రభుత్వం మెమో జారీ చేసిందంటూ గుర్తుచేశారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోమవారం ప్రకటన విడుదల చేశారు. జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయ నిధుల (ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌) కింద 2014 నుంచి కేంద్రం.. తెలంగాణ రాష్ట్రానికి రూ.3,069.87 కోట్లు కేటాయించిందని, అయితే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం ఇంకా నిధులు అందలేదని చెబుతోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. అధునాతన సాంకేతిక యుగంలో, BRS ప్రభుత్వం కేంద్ర నిధులపై వాస్తవికతను కప్పిపుచ్చలేకపోయిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్‌డిఆర్‌ఎఫ్ కింద పంట నష్టపరిహారం అందజేస్తామని కె.చంద్రశేఖరరావు ప్రభుత్వం మెమో జారీ చేసిందని వివరించారు. ఇందులో కేంద్రం తన వాటాలో 75 శాతాన్ని మంజూరు చేసిందని, బీఆర్‌ఎస్ నాయకులు ఈ విషయాన్ని బహిరంగంగా గుర్తించాలని ఆయన సూచించారు.

రాజకీయ కారణాలతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను నిలిపివేశారని, అయితే పంటల బీమాకు ప్రత్యామ్నాయ పథకాన్ని ప్రవేశపెట్టడంలో విఫలమయ్యారని కిషన్ రెడ్డి ఆరోపించారు. దీంతో రైతులు పంట నష్టపరిహారం పొందలేకపోతున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పీఎంఎఫ్‌బీవైని అమలు చేసి ఉంటే రైతులకు పరిహారం సముచితంగా అందేదని కిషన్ రెడ్డి వివరించారు.

ఇవి కూడా చదవండి

పంట నష్టానికి పరిహారం ప్రకటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ కిషన్‌రెడ్డి వివరించారు. ఏప్రిల్ 1 2022 నాటికి రూ.608.06 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ అందుబాటులో ఉందని, ఈ సొమ్మును రైతులకు అందజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. 22 జూలై 2022న విడుదలైన 2022-23 సంవత్సరానికి SDRF 1వ విడత రూ.188.80 కోట్ల సెంట్రల్ వాటా, సంబంధిత రాష్ట్ర వాటాతో పాటు, SDRF దాదాపు ₹860 కోట్ల కార్పస్‌ని కలిగి ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందంటూ కిషన్ రెడ్డి వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటున్నప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారంటూ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం అసత్య ప్రచారం మానుకోవాలంటూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హితవు పలికారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..