TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు మరో ఇద్దరు అరెస్ట్.. వీరిలోనల్గొండకు చెందిన అన్నా చెల్లెళ్లు
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఇందులో నల్గొండ జిల్లాకు చెందిన అన్నా చెల్లెళ్లు ఉండటం..
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు వ్యవహారంలో మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. డివిజనల్ అకౌంట్స్ అధికారి ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన నల్గొండకు చెందిన అన్నా చెల్లెళ్లయిన రాయపురం విక్రమ్, రాయపురం దివ్యలను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఏఈ ప్రశ్నపత్రం విక్రయించినందుకు పూల రవికిషోర్ అనే వ్యక్తిని తాజాగా సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 39కి చేరింది.
అరెస్టు చేసినవారిని అదులోకి తీసుకుని సిట్ అధికారుల విచారణ చేస్తున్నారు. కానీ ఒకే ఒక్క అంశంపై ఇప్పటి దాకా సిట్ అధికారులు ఏమీ తేల్చలేకపోయారు. అదే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వ్యవహారం. కాన్ఫిడెన్షియల్‌గా ఉండాల్సిన ఈ వ్యవహారం ఎలా లీక్ అయింది..? ఎవరు ఎవరి నుంచి దొంగిలించారన్నది ఇప్పటికీ సిట్ అధికారులు గుర్తించలేకపోయారు. ఈ మిస్టరీ వీడితే కేసు కొలిక్కి వచ్చే అవకాశముంది. అయితే ఇన్ని రోజులుగా విచారణ జరుగుతున్నా అధికారులు ఎందుకు తేల్చలేకపోతున్నారన్నది అంతుపట్టడం లేదు.
కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇంఛార్జ్‌గా శంకర్ లక్ష్మి ఉన్నారు. తనకు తెలియకుండా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఎవరు కొట్టేశారు..? ఎలా కొట్టేశారన్నది తేలాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా అధికారుల దీనిపై ఎటూ తేల్చలేకపోయారు. దీంతో శంకర్ లక్ష్మిపై అనుమానాలు బలపడుతున్నాయి. మొదట్లో శంకర్ లక్ష్మీ డైరీ నుంచి యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌లు ప్రవీణ్ దొంగిలించాడనే ఆరోపణలొచ్చాయి. ఆ తర్వాత మళ్లీ దీనిపై అధికారులు దృష్టి సారించినట్టు కనిపించలేదు.
పేపర్ లీక్ కేసులో ఇప్పటిదాకా 39మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కానీ పాస్ వర్డ్ మిస్టరీ వీడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం