Telangana: ఛీ..ఛీ వ్యాపారం చేసుకోండ్రా అంటే.. కోళ్లఫారంలో ఈ పనులు చేస్తారా

ఈ మధ్య మాదక ద్రవ్యాలు తయారు చేయడం, వాటిని ఇతర ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేసి అమ్మాడం విపరీతంగా పెరిగిపోయింది. యువతే లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఆకతాయుల ఆగడాలుకు హద్దు, అదుపు లేకుండా పోతుంది.

Telangana: ఛీ..ఛీ వ్యాపారం చేసుకోండ్రా అంటే.. కోళ్లఫారంలో ఈ పనులు చేస్తారా
Drugs
Follow us
Aravind B

|

Updated on: May 25, 2023 | 4:05 AM

ఈ మధ్య మాదక ద్రవ్యాలు తయారు చేయడం, వాటిని ఇతర ప్రాంతాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేసి అమ్మాడం విపరీతంగా పెరిగిపోయింది. యువతే లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఆకతాయుల ఆగడాలుకు హద్దు, అదుపు లేకుండా పోతుంది. పోలీసులు, అధికారులు ఎక్కడో ఓ చోట అక్రమంగా గంజాయి రవాణా చేసేవాళ్లని ఎన్నిసార్లు పట్టుకున్నప్పటికీ మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ అధికారులు భారీగా మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే బిజినేపల్లి మండలం వట్టెం గ్రామ శివారులోని మారుమూల ప్రాంతంలో ఓ కోళ్లఫారం ఉంది. అయితే అందులో ఎవరికీ అనుమానం రాకుండా మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు బుధవారం దాడులు నిర్వహించి రూ.3.14 కోట్ల విలువైన 31.42 కిలోల ఆల్ఫ్రాజోలమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్న మెషనరీ మొత్తాన్ని సీజ్‌ చేశారు. చివరికి ఆల్ఫ్రాజోలమ్‌ను తయారు చేస్తున్న నిందితుడ్ని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం