TS Police Final Results 2023: కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్ధులకు అలర్ట్.. త్వరలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆ తర్వాతే కటాఫ్ ప్రకటన!
తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల రీకౌంటింగ్ ముగిసింది. ఈ మేరకు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని పరీక్షలకు కలిపి 3,55,387 ఓఎంఆర్ షీట్లుండగా.. వీటిలో రీకౌంటింగ్‌కు 1,338 మంది..
తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల రీకౌంటింగ్ ముగిసింది. ఈ మేరకు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని పరీక్షలకు కలిపి 3,55,387 ఓఎంఆర్ షీట్లుండగా.. వీటిలో రీకౌంటింగ్‌కు 1,338 మంది రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రీకౌంటింగ్ ఫలితాలు జూన్ 6 అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై నియామాకాలకు సంబంధించి తుది రాత పరీక్షల ఫైనల్ కీపై ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి 3 వరకు రీకౌంటింగ్/ రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఏ, బీ క్యాటగిరీలలోని అభ్యర్థుల దరఖాస్తులలో తప్పుల సవరణకు 6 నుంచి 8న రాత్రి 8 గంటల వరకు అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. సీ క్యాటగిరీలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
ఎంపికైన అభ్యర్ధులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలవనున్నట్లు శ్రీనివాసరావు చెప్పారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ధృవీకరణ పత్రాలన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలన్నారు. 2014 జూన్ 2 తర్వాత జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలనే పరిగణనలోకి తీసుకొంటామని స్పష్టం చేశారు. అలాగే 2021 ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్న నాన్ క్రీమీలేయర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లనే అంగీకరిస్తామన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం కటాఫ్ మార్కులు ప్రకటిస్తామని తెలిపారు. కటాఫ్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.