AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srinivas Goud: అందుకే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు స్కెచ్.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ (Telangana Minister Srinivas Goud) హత్యకు స్కెచ్ వేసిన కేసులో రిమాండ్ రిపోర్ట్‌ సంచలనంగా మారింది. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్ టీవీ9 చేతికి చిక్కింది.

Srinivas Goud: అందుకే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు స్కెచ్.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
Telangana Minister Srinivas Goud
Janardhan Veluru
|

Updated on: Mar 04, 2022 | 11:39 AM

Share

తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ (Telangana Minister Srinivas Goud) హత్యకు స్కెచ్ వేసిన కేసులో రిమాండ్ రిపోర్ట్‌ సంచలనంగా మారింది. శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్ టీవీ9 చేతికి చిక్కింది. శ్రీనివాస్‌గౌడ్‌పై ఉన్న వ్యక్తిగత కక్ష్యతోనే ఆయన్ను హత్య చేసేందుకు నిందితుడు రాఘవేంద్రరాజు కుటుంబం సహా మిగతా వాళ్లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్‌ ప్రకారం వీళ్లంతా స్కెచ్ వేసిన నిందుతులే అయినా, హత్యకు ప్లాన్ చేసింది మాత్రం బాధలతోనే అనే విషయం స్పష్టమవుతోంది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు మేం బాధితులమని ఆయన్ను అంతమొందించేందుకు ప్లాన్ చేసిన నిందితులు చెప్పుకుంటున్నారు.

ముందుగా శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేసేందుకు రాఘవేంద్రరాజు కుటుంబ సభ్యుల ఓ సమావేశం పెట్టుకున్నారు. మహబూబ్‌నగర్‌లో తమను ఆర్థికంగా ఎదగనీయకుండా చేస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేయడమే తమముందున్న ఏకైన మార్గమని అంతా భావించారు. పక్కా స్కెచ్‌కు రఘవేంద్రరాజు సోదరులు సిద్ధమయ్యారు. ఇక అప్పటి నుంచే పక్కా ప్లాన్‌ను అమలు చేసేందుకు ఒక్కో అడుగు వేశారు.

శ్రీనివాస్‌గౌడ్‌పై కోర్టు కేసుల కోసం రూ.4కోట్ల  వరకు రాఘవేంద్రరాజు కుటుంబం ఖర్చు చేసిందట. జిరాక్స్‌ కాపీల బిల్లలకే రూ.18 లక్షలు ఖర్చు చేసినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు. ఆనంద్‌, హైదర్‌ అలీ, శ్రీకాంత్‌ గౌడ్‌లను తెర ముందు ఉంచి.. తమ కుటుంబాన్ని శ్రీనివాస్‌గౌడ్‌ వేధించారని రాఘవేంద్రరాజు పోలీసులకు చెప్పాడు . తన భార్యతో పాటు తన తమ్ముళ్ల భార్యలను అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించిన వ్యక్తి శ్రీనివాస్‌గౌడ్‌ అంటూ చెప్పుకొచ్చారు. రాజకీయంగా వాడుకొని వదిలేయడమే కాదు.. ఆ తర్వాత వేధింపులకు దిగిన శ్రీనివాస్‌గౌడ్‌ను చంపాలనుకున్నది ఆయన అరాచకాలను భరించలేకే అని పోలీసుల ఎదుట నిందితులు ఒప్పుకున్నారు

ఇక రిమాండ్‌ రిపోర్ట్‌లో వినిపిస్తున్న మరో పేరు మున్నూరు రవి. రిటైర్డ్‌ ఆర్మీ అధికారి అయిన తన తండ్రికి రాష్ట్ర ప్రభుత్వం భూమి,డబ్బు ఇస్తుంటే దాన్ని శ్రీనివాస్‌గౌడ్‌ అడ్డుకున్నారన్నది మున్నూరు రవి ఆరోపణ. మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా తనకు రావాల్సిన డబ్బులను, రాజకీయంగా దక్కాల్సిన MLC పదవినీ శ్రీనివాస్‌ గౌడ్ అడ్డుకున్నట్లు చెబుతున్నాడు రవి. అందుకే శ్రీనివాస్‌గౌడ్‌ను చంపాలనుకుని రాఘవేంద్రరాజుకు సాయం చేశానని మున్నూరు రవి తెలిపాడు.

ఇక మరో నిందితుడు యాదయ్య కూడా తాను శ్రీనివాస్‌గౌడ్‌ బాధితుడ్ని అని చెబుతున్నాడు. తన కూతురు క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌కు రూ.20 లక్షలు ఇస్తానని శ్రీనివాస్‌గౌడ్‌ మోసం చేశాడని, శ్రీనివాస్‌గౌడ్‌ మాట వినడం వల్ల నా కూతురిని పోగొట్టుకున్నానని, అందుకే చంపాలనుకున్నా అని యాదయ్య తన వెర్షన్ వినిపించాడు.

దీంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర వెనుక రాజకీయ కారణాలు లేవని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు   సమాచారం.

Also Read..

Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. 

Polavaram Project: ఏపీలో సీఎం జగన్‌తో కలిసి కేంద్ర మంత్రి షెకావత్‌ పర్యటన.. పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన