Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. 

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం మన చమురు ధరలపై కనిపించడం లేదు. అయితే మరొకొద్ది రోజుల్లో..

Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న వ్యత్యాసం.. మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా.. 
Follow us

|

Updated on: Mar 04, 2022 | 11:13 AM

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం మన చమురు ధరలపై కనిపించడం లేదు. అయితే మరొకొద్ది రోజుల్లో ఈ ఎఫెక్ట్ ఉంటుదని అంచనా వేస్తున్నారు. గత కొన్ని నెలలుగా చమురు ధరలు స్థిరంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొద్దిగా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను గురువారం తాజాగా విడుదల చేసింది.  అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉన్నాయి. మార్చి 4, శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 111.5 డాలర్లకు తగ్గగా, మార్చి 3న ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 117 డాలర్లుగా ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా పెట్రోలు , డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు మార్చి 4న పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేశాయి.. నేటికీ ఇంధన ధరలలో ఎటువంటి మార్పు లేదు..నవంబర్ 2021 వరకు దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి.

దేశవ్యాప్తంగా 4 నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలు ..

మరోవైపు, దేశంలోని ప్రముఖ చమురు కంపెనీలు మార్చి 3, గురువారం కొత్త పెట్రోల్ మరియు డీజిల్ ధరలను విడుదల చేశాయి. నేటికీ దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలో పెట్రోలు మరియు డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు రావడానికి 121 రోజులు (4 నెలలు) అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దేశంలో చమురు ధరలు చివరిగా నవంబర్ 4, 2021న మార్చబడ్డాయి. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను తాజాగా విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం మీ కోసం..

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.25గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.65గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.94గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.86గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.55గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.62 ఉండగా.. డీజిల్ ధర రూ.95.01గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.51కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.59లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.47 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.83గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.51 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.84గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.91గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.03గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.51లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.59లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.14 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.68గా ఉంది.

ఇవి కూడా చదవండి: Blood Sugar: ద్రాక్ష తినడం వల్ల డయాబెటిస్‌ ఉన్నవారిలో చక్కెర పెరుగుతుందా..? నిజం ఏమిటో తెలుసుకోండి..

Russia Ukraine War Live Updates: ఉగ్రరూపు దాల్చిన యుద్ధం.. రష్యాకు లొంగిపోయిన తొలి ఉక్రెయిన్‌ నగరం