Telangana: యాసంగిలో వరిసాగు వద్దు.. సీఎస్ సోమేశ్ కుమార్ కీలక ప్రకటన
Paddy Cultivation: యాసంగిలో వరిసాగు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రైతులకు సూచించారు. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవొద్దని కేంద్రం ప్రభుత్వం,
Paddy Cultivation: యాసంగిలో వరిసాగు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రైతులకు సూచించారు. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం ప్రభుత్వం, ఎఫ్‌సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిర్ణయించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో యాసంగి వరి పారాబాయిల్డ్ బియ్యానికే అనుకూలంగా ఉన్నాయని.. ఈ క్రమంలో రైతులు యాసంగిలో వరి సాగు చేయొద్దంటూ సూచించారు. శనివారం తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులతో సీఎం సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. పారాబాయిల్డ్ బియ్యం తీసుకోవద్దని కేంద్రం, ఎఫ్‌సీఐ నిర్ణయించాయని పేర్కొన్నారు. కావున రైతులు యాసంగిలో వరి సాగు చేయొద్దంటూ సూచించారు. విత్తన కంపెనీలు, మిల్లర్లతో ఒప్పందాలున్న రైతులు వరిసాగు చేయొచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే కొంటామని కేంద్రం చెప్పిందని.. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే.. అవసరమైన ప్రాంతాల్లో కొత్త కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తున్నట్లు సమాచారం అందిందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read: