T Congress: వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి.. తెలంగాణ కాంగ్రెస్ రెండు రోజు వరి దీక్షలో నేతల డిమాండ్

రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ 48 గంటల దీక్షకు పూనుకంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ వరి దీక్ష ప్రారంభమైంది.

T Congress: వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి.. తెలంగాణ కాంగ్రెస్ రెండు రోజు వరి దీక్షలో నేతల డిమాండ్
Congress
Follow us

|

Updated on: Nov 27, 2021 | 1:46 PM

Telangana Congress Vari Deeksha: యాసంగిలో వరి వేయాలా? వద్దా ? తెలంగాణలో ఇప్పుడు రైతులను వేధిస్తున్న ప్రశ్న? కేంద్రం వరి వేయొద్దని చెప్పిందని రాష్ట్ర మంత్రులు చెబుతుంటే, కేంద్రం మాత్రం తామలా చెప్పలేదంటోంది. యధావిధిగా కొనుగోళ్లు జరుగుతాయంటోంది. మరోవైపు, తెలంగాణలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వరి కోతలు మొదలయ్యాయి. అటు ధాన్యం కూడా ఎక్కడికక్కడ పేరుకుపోయింది. కొనుగోళ్లు లేక అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. పెద్ద ఎత్తున కల్లాల్లో పేరుకుపోయిన ధాన్యం నిల్వలను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గోడౌన్‌లు లేక రోడ్ల మీదే వడ్లను నిల్వ ఉంచి, రాత్రి కూడా అక్కడే నిద్రిస్తున్నారు రైతులు.

మరోవైపపు, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై తెలంగాణవ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు. మొదటి నుంచి వరి పండే పొలాల్లో ఇతర పంటలు పండించే వీలు లేదని ప్రత్యామ్నాయ పంటలు వేయలేమని చెబుతున్నారు. ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. వరి ధాన్యం కోతలకు వచ్చినా పొలంలోనే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు రైతులు. వరి కోతల తర్వాత ధాన్యం నిల్వ ఉంచే పరిస్థితి లేదంటున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ కాంగ్రెస్ 48 గంటల దీక్షకు పూనుకంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ వరి దీక్ష శనివారం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి మెడలో సీనియర్ నేత వి హనుమంతరావు ఆకుపచ్చ కండువావేసి దీక్షను ప్రారంభించారు. నెల రోజుల నుంచి కల్లాల్లో ఉన్న వరిధాన్యం కొనాలని డిమాండ్ తో ఈ దీక్ష చేప‌ట్టింది కాంగ్రెస్‌. తడిసిన ధాన్యం కూడా కొనాల్సిందే అని కాంగ్రెస్‌ డిమాండ్ చేస్తుంది. మొలకెత్తిన ధాన్యం బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాల‌ని కాంగ్రెస్ కోరుతుంది. ఈ కార్యక్రమంలో వి.హెచ్, సీతక్క, చిన్నారెడ్డి, కోదండ రెడ్డి, మల్లు రవి, కాంగ్రెస్ ముఖ్య నేతలు దీక్షలో కూర్చున్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది.

రెండు నెలలుగా వరి ధాన్యం కొనడం లేదని.. రైతులు వరి కుప్పలమీద మరణిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. దేశంలో రైతులకు సంకెళ్లు వేసి వరి ధాన్యం కొనుగోల్లు నిలిపివేశారన్నారు. కాంగ్రెస్‌ నేతల్లో మనస్పర్థల గురించి మాట్లాడిన వీహెచ్‌.. అందరం ఐకమత్యంగా ఉండి పోరాడదామని చెప్పారు. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య గొడవులున్నాయని.. రేవంత్ రెడ్డి వారందరితో మాట్లాడి అంతా సెట్ చేయాలని కోరారు. ఇక మోడీ హయాంలో గ్యాస్ పోయ్యి పోయి.. పిడుకలు వచ్చేలా ఉన్నాయంటూ సెటైర్లు వేశారు వీహెచ్‌. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని విహెచ్ డిమాండ్ చేశారు. రైతుల జీవితం కల్లాల్లో తెల్లారుతోందని ఎమ్మెల్యే సీతక్క ఆవేద వ్యక్తం చేశారు. కేంద్రం 10 వేల కోట్లు పెట్టి వరి ధాన్యం కొనుగోలు చేయలేరా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ జంతర్‌మంతర్ దగ్గర ధర్నా ఎందుకు చేయలేదని నిలదీశారు. ముందు వర్షాకాలంలో పండిన పంట మొత్తం కొనాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు.

వరి ధాన్యం అమ్ముకోలేక రైతుల భాధలు తెలియజేస్తున్నాం తప్ప.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయలేడంలేదని జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతిలో అధికారం ఉన్నా… రైతులతో రాజకీయం చేసిందన్నారు. గతంలో ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేని సమయంలో కూడా కాంగ్రెస్ వరి ధాన్యం కొనుగోలు చేసిందని ఆయన గుర్తు చేశారు. వరి పండించండని.. వద్దని కేసీఆరే చెప్తాడని.. అసలు ఆయనకు వ్యవసాయం గురించే తెలియదని కోదండరెడ్డి పేర్కొన్నారు. మొలకెత్తిన, తడిసిన ధాన్యం కూడా కొన్నామ‌ని తెలిపారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన