AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad News: వద్దు పప్పా అన్నా వినలేదు.. పసిబిడ్డను గొడ్డును బాదినట్లు బాదిన కసాయి తండ్రి..

Hyderabad: పప్పా.. పప్పా కొట్టొద్దు పప్పా.. అంటూ ఓ పసి బాలుడు బ్రతిమిలాడుతూ మంచం కిందికి వెళ్లి దాచుకున్నా తలగడ అడ్డం పెట్టుకున్నా --- కూతురు వద్దు పప్పా అని ప్రాధేయపడుతున్నా..

Hyderabad News: వద్దు పప్పా అన్నా వినలేదు.. పసిబిడ్డను గొడ్డును బాదినట్లు బాదిన కసాయి తండ్రి..
Arrest
Shiva Prajapati
|

Updated on: Nov 28, 2021 | 6:35 AM

Share

Hyderabad: పప్పా.. పప్పా కొట్టొద్దు పప్పా.. అంటూ ఓ పసి బాలుడు బ్రతిమిలాడుతూ మంచం కిందికి వెళ్లి దాచుకున్నా తలగడ అడ్డం పెట్టుకున్నా — కూతురు వద్దు పప్పా అని ప్రాధేయపడుతున్నా.. ఆ కర్కోటక కన్న తండ్రికి హృదయం చలించలేదు. రెండున్నర నిమిషాలు ఆగకుండా చేతిలోని కట్టె విరిగేలా ఒళ్లంతా హూనం చేసిన హృదయవిధారక ఘటన పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఛత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ తెలిపిన వివరాల ప్రకారం.. గౌలిపురాకు చెందిన జి. అశోక్‌కు ఇద్దరు సంతానం. ఒక కుమారుడు (8), కుమార్తె. అశోక్‌కు రూప్ బజార్లో ఎలక్ట్రికల్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొడుకు బాగా అల్లరి చేస్తున్నాడని అప్పుడే ఇంటికి వచ్చిన భర్త అశోక్‌కు భార్య చెప్పింది. తాగిన మత్తులో ఉన్న అశోక్ కన్న కొడుకుపై వీరంగం సృష్టించాడు. కట్టెతో ఇష్టం వచ్చినట్టు 2.30 నిమిషాలపాటు చితకబాదాడు. ఇదంతా కూతురు సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తూనే కొట్టొద్దు పప్పా అంటూ బ్రతిమిలాడింది. బాలుడి ఒళ్లంతా హూనం కావడంతో తల్లి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Also read:

శీతాకాలంలో నైట్ క్రీమ్ కోసం డబ్బు వృధా చేస్తున్నారా..! దీనికంటే మంచిది మరొకటి ఉండదు..

Bike Loan: లోన్‌ తీసుకొని బైక్‌ కొంటున్నారా..! ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..

Car prices: జనవరిలో కార్ల ధరలు మళ్లీ పెరిగే అవకాశం.. కంపెనీలు ఏం చెబుతున్నాయంటే..?