TRS: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. పేర్లు ప్రకటించిన సీఎం కేసీఆర్..
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీవకొండ దామోదర్ రావు , మెటిరో డాక్టర్. బండ పార్థసారథి రెడ్డి, గాయత్రి రవికి కేటాయించారు.
టీఆర్ఎస్(TRS) రాజ్యసభ అభ్యర్థులను ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు, హెటిరో అధిపతి డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) పేర్లను సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇద్దరు ఓసీ, ఒక బీసీ అభ్యర్థిని టీఆర్‌ఎస్ ప్రకటించినవారిలో ఉన్నారు. అయితే.. ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాశ్ స్థానం కోసం జరగనున్న ఉపఎన్నికకు ఈనెల19తో నామినేషన్ల గడువు ముగియనుండటంతో సీఎం కేసీఆర్.. రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు.డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానంలో ఎన్నికలకు ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఒకేసారి ముగ్గురు అభ్యర్థుల పేర్లను బుదవారం ప్రకటించారు సీఎం కేసీఆర్. మూడుస్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై కొన్ని రోజులుగా కేసీఆర్ ముమ్మర కసరత్తు చేసినట్లుగా సమాచారం. మూడు స్థానాల కోసం సుమారు పది మంది పేర్లు పరిశీలనకు వచ్చినా .. సీఎం కేసీఆర్.. వీరివైపే మొగ్గుచూపారు.
దీవకొండ దామోదర్ రావు- ఇక 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పలు హోదాల్లో పని చేశారు దీవకొండ దామోదర్ రావు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ – ఫైనాన్స్‌గా వ్యవహరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన టీ న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరుకు చెందిన దీవకొండ దామోదర్ రావు 1958 ఏప్రిల్ 1న జన్మించిన దామోదర్ రావుకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
బండి పార్థసారథిరెడ్డి.. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జన్మించారు పార్థసారథిరెడ్డి. కందుకూరులో డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తూనే హెటిరో సంస్థను స్థాపించారు. తన సంస్థ ద్వారా దాదాపు పది వేల మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పించారు. స్వగ్రామమైన కందుకూరులో కల్యాణమండపం, సాయిబాబా దేవాలయాన్ని నిర్మించారు. పలు విద్యాసంస్థలు స్థాపించి విద్యావేత్తగా సేవలందిస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనే పార్థసారథిరెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు.
గాయత్రి రవి-గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర 2019లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నన్నపునేని నరేందర్‌పై వడ్డిరాజు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
డా. బండి పార్థసారథి రెడ్డి, శ్రీ వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), శ్రీ దీవకొండ దామోదర్ రావు లను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్. pic.twitter.com/SmC84H2vut
— TRS Party (@trspartyonline) May 18, 2022