CM KCR: కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డ కేసీఆర్‌..అలా చేయడం చిల్లర వ్యవహారం అంటూ సీఎం ఫైర్

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయని,..

CM KCR: కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డ కేసీఆర్‌..అలా చేయడం చిల్లర వ్యవహారం అంటూ సీఎం ఫైర్
Cm Kcr
Follow us
Jyothi Gadda

|

Updated on: May 18, 2022 | 5:17 PM

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారంగా సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. జవహర్ రోజ్ గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. దేశంలో ఇంకా చాలా ప్రాంతాల్లో కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయని అన్నారు. త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో ఆశించిన స్థాయిలో ప్రగతి లేదన్నారు. కేంద్రం వీటిపై దృష్టి పెట్టకుండా రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయని చెప్పారు.. పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు, మేయర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. కొన్ని జిల్లాల్లో అధికారుల అలసత్వం కారణంగా పల్లె ప్రగతి సరిగా అమలు కాకపోవడంపై ఇటీవల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు.

విధ్వంసం అంనతంర వ్యవస్థలను పునర్న్మించుకోవడం చాలా కష్టమైన పని అని అన్నారు సీఎం కేసీఆర్‌. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తున్నదని చెప్పారు. అన్ని కష్టాలను అధిగమించి నేడు దేశం గర్వించే స్థాయిలో తెలంగాణ పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. మనం చేస్తున్న పనిని ఇతరులు గుర్తించడమే ప్రగతికి కొలమానమనీ.. పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు, ఆదరణ లభించిందని హర్షం వ్యక్తం చేశారు. రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమని అన్నారు. ఈ దిశగా కృషి చేసిన పంచాయతీ రాజ్ శాఖను, మంత్రిని సీఎం కేసీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా..కర్ణాటక రాష్ట్రానికి చెందిన పచ్చదనం,పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అర్పించిన, 110 సంవత్సరాల పద్మశ్రీ తిమ్మక్క గారిని మంత్రులు ఉన్నతాధికారుల సమక్షంలో ఘనంగా సీఎం కేసిఆర్ సన్మానించారు.

వేసవి తీవ్రత దృష్ట్యా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను కొద్దిరోజుల పాటు వాయిదా వేయాలని సమావేశంలో సభ్యులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈనెల 20 నుంచి నిర్వహించాల్సిన ఆ కార్యక్రమాలను జూన్‌ 3 నుంచి 15 రోజుల పాటు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌… ‘‘ఉమ్మడి పాలనలో తెలంగాణ చాలా ధ్వంసమైంది. విధ్వంసం అనంతరం వ్యవస్థలను పునర్‌ నిర్మించడం చాలా కష్టం. ధ్వంసమైన తెలంగాణను బాగుచేసేందుకు కష్టపడాల్సి వస్తోంది. నేడు దేశం గర్వించే స్థాయిలో పల్లె, పట్టణాల అభివృద్ధి చేస్తున్నాం. పల్లె, పట్టణ ప్రగతికి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం హర్షణీయం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో తొలిసారి 10 గ్రామాలు ఎంపికయ్యాయి. రెండో సారి ప్రకటించిన జాబితాలో మొదటి 20 స్థానాల్లో తెలంగాణ నుంచే 19 గ్రామాలు ఉండడం గొప్ప విషయం. ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించి ప్రగతి సాధిస్తున్నాం. ప్రభుత్వం చేపట్టిన చర్యలు నేడు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయి. దేశం గర్వించే విధంగా మిషన్‌ భగీరథ ద్వారా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నాం. అనతికాలంలోనే అభివృద్ధిని సాధించగలిగాం. భాగస్వామ్యులైన ప్రజాప్రతినిధులు, అధికారులకు అభినందనలు’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎస్ కె డే గారు ప్రారంభించిన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒక ఉద్యమం అన్నారు సీఎం కేసీఆర్‌… కానీ నేడు అందులో రాజకీయాలు ప్రవేశించి అవి అన్ని రకాలుగా పంచాయతీ రాజ్ స్ఫూర్తి చంపేశాని అన్నారు.. దేశంలో ప్రారంభమైన సహకార ఉద్యమం కూడా కలుషితం చేయబడింది. ఇటువంటి అరాచకమైన, నిర్లక్ష్యమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న ప్రాధాన్యతా క్రమాలు కొందరికి జోక్ లాగా కనిపించాయి. తెలంగాణ వచ్చిన ప్రారంభంలో నేను అటవీ శాఖ, అడవుల పరిరక్షణ మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఈ అడవులేంది అని కొందరు నవ్వుకున్నారు. కానీ నేడు దేశ పర్యావరణం, పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునాటికి అస్తవ్యస్తంగా, యుద్ధవాతావరణంతో కూడుకొని ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను ఇవ్వాల దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నాం. ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్న పరిస్థితి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదు. అన్ని రంగాల్లో జరిగిన తెలంగాణ అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా ఛానళ్ళు ప్రసారం చేశాయి. ఇది చూసిన ఇతర రాష్ట్రాల వారికి ఆశ్చర్యం కలిగింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి నాకు ఫోన్లు చేసి అడుగుతన్నారు. అంటే మనం అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించాం. ఇందులో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అనిచెప్పారు సీఎం కేసీఆర్‌.

ఈ సందర్భంగా..కర్ణాటక రాష్ట్రానికి చెందిన పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అర్పించిన, 110 సంవత్సరాల పద్మశ్రీ తిమ్మక్క గారిని మంత్రులు ఉన్నతాధికారుల సమక్షంలో ఘనంగా సన్మానించారు సీఎం కేసిఆర్.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?