Pithapuram: అత్తను అతి కిరాతకంగా నరికి చంపిన అల్లుడు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..?

కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిఠాపురం పట్టణం విద్యుత్‌ నగర్‌లో తెల్లవారుజామున దారుణహత్య జరిగింది. పిల్లనిచ్చిన అత్తనే అతి కిరాతకంగా నరికి చంపేశాడు ఓ అల్లుడు. అడ్డుకునే ప్రయత్నం చేసినవారిపై కూడా

Pithapuram: అత్తను అతి కిరాతకంగా నరికి చంపిన అల్లుడు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..?
crime news
Follow us
Jyothi Gadda

|

Updated on: May 18, 2022 | 12:23 PM

కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పిఠాపురం పట్టణం విద్యుత్‌ నగర్‌లో తెల్లవారుజామున దారుణహత్య జరిగింది. పిల్లనిచ్చిన అత్తనే అతి కిరాతకంగా నరికి చంపేశాడు ఓ అల్లుడు. అడ్డుకునే ప్రయత్నం చేసినవారిపై కూడా దాడిచేయటంతో మామ, బావమరిదికి కూడా గాయలయ్యాయి. 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

విద్యుత్‌ నగర్‌కు చెందిన రమణమ్మ, సత్యన్నారాయణల కూతురు దివ్యకు, కొత్త కందరాడకు చెందిన సైతన రమేష్‌తో ఐదేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, రమేష్‌ భార్య దివ్య గత ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉంటుంది. దీంతో అత్తామామలపై అక్కసు పెంచుకున్నాడు రమేష్‌. తన భార్యను కాపురానికి పంపటంలేదనే ఆగ్రహంతో అత్తవారింటికి వెళ్లాడు. ఉదయానే రమణమ్మ ఇంటిముందు వాకిలి తుడిచేందుకు గేటు తీసింది. అప్పటికే గేటు బయట ఉన్న ఆమె అల్లుడు రమేష్ ఒక్కసారిగా కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న ఆమె భర్త సత్యన్నారాయణ, కుమారుడు దిలీప్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వారిపై కూడా రమేష్ దాడికి పాల్పడ్డాడు. కత్తితో రమణమ్మ మేడపై ఒక్కసారిగా వేటు వేయటంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. ఆమె భర్తకు, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహయంతో వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..