Student Died: విషాదం.. పరీక్ష రాస్తూ కుప్పకూలిన మరో విద్యార్థి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
Student Died: పరీక్ష రాస్తు మరో విద్యార్థి కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కళాశాల నిర్వాహకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందింది..
Student Died: పరీక్ష రాస్తు మరో విద్యార్థి కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన కళాశాల నిర్వాహకులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందాడు. కార్తీక్ అనే విద్యార్థి శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని కిరణ్మయి కాలేజీలో ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. అయితే ఈ రోజు కెమిస్ట్రీ పరీక్ష రాస్తూ సృహ కోల్పోయాడు. దీంతో స్పందించిన కళాశాల నిర్వాహకులు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. కార్తీక్ సారవకోట మండలం, దాసుపురం గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.
కాగా, గత వారం రోజుల కిందట తిరుపతిలో ఇంటర్ విద్యార్థి పరీక్ష రాస్తూ కుప్పకూలిపోయి మృతి చెందాడు. సైదాపురానికి చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి సతీష్(18) పరీక్ష రాసేందుకు గూడూరులోని డీఆర్‌డబ్ల్యూ పరీక్ష కేంద్రానికి వచ్చాడు. పరీక్ష రాస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వెంటనే ఉపాధ్యాయులు వైద్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చే సరికి మృతి చెందాడు. దీంతో ఆ కళాశాలలో తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు మరో విద్యార్థి మృతి చెందడం కలకలం రేపుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి