Love Failure: ఊహకందని రివేంజ్.. ప్రేయసి పెళ్లికి ప్రియుడి గిఫ్ట్.. సీన్ కట్ చేస్తే బెడ్‌పై పెళ్లి కొడుకు..!
Love Failure: ప్రస్తుత కాలంలో ప్రేమ అనే పదానికి అర్థాలే మారిపోతున్నాయి. ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరగడం, ఆ తరువాత ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ,
Love Failure: ప్రస్తుత కాలంలో ప్రేమ అనే పదానికి అర్థాలే మారిపోతున్నాయి. ప్రేమ పేరుతో విచ్చలవిడిగా తిరగడం, ఆ తరువాత ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదంటూ, రకరకాల కారణాలతో తమ భాగస్వామికి బ్రేకప్ చెప్పి మరొకరితో పెళ్లికి సిద్ధమైపోతున్నారు. అయితే, కొందరు మాత్రం ప్రేమ విషయంలో రాక్షసులుగా మారిపోతున్నారు. ప్రాణంగా ప్రేమించిన వారు దూరమవుతుంటే తట్టుకోలేక.. ఎలాగైనా వారిని దక్కించుకోవాలనే ఆలోచనలతో తమలోని శాడిజాన్ని బయటకు ప్రదర్శిస్తున్నారు. కొందరు ఏకంగా తమను వదిలేసిన వారిపట్ల పగ పెంచుకుని హత్యలు చేసే స్థాయికి వెళ్తున్నారు. తాజాగా ఇలాంటి ఉదంతమే గుజరాత్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
ప్రేమయసి తమను కాదందనే కారణంతో ఎంతో మంది అబ్బాయిలు, అమ్మాయిలపై దాడులు చేసి చంపిన ఘటనలు ఉన్నాయి. కానీ, ఇక్కడ ఆ ప్రేమికుడు రివేంజ్ తీసుకున్న విధానం అందరినీ షాక్ కు గురి చేసింది. మునుపెన్నడూ ఎవరూ చేయని విధంగా తన ప్రేయసిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఇంతకీ అతను ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాకు చెందిన రాజ్ ధన్‌సుఖ్ పటేల్, సల్మా ప్రేమించుకకున్నారు. అయితే, వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దాంతో యువతి పెద్దలు నిశ్చయించిన వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది. తాను ప్రాణంగా ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం నిశ్చయమైందని అతను కుమిలిపోయాడు. తట్టుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ.. పైకి మాత్రం మంచిగానే ఉన్నట్లు నటించాడు.
ఇంతలో పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. తన ప్రేమను మరిచిపోయినట్లుగానే నటిస్తూ.. తన ప్రేయసి సల్మా, లతేష్ పెళ్లికి హాజరయ్యాడు. ఒట్టి చేతులతో కూడా కాదు.. మాంచి గిఫ్ట్ పట్టుకొచ్చాడు. పెళ్లి వేదికపైకి ఎక్కి.. నవ దంపతులకు ఆ గిఫ్ట్ బహుకరించాడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెష్ కూడా చెప్పాడు. అయితే, సాధారణంగా గిఫ్ట్ ప్యాక్‌లను పెళ్లి తరువాత తీరిగ్గా తెరుస్తారు. ఈ దంపతులు కూడా అదే చేశారు. పెళ్లి తంతు అయిపోయిన తరువాత ఇంటికెళ్లాక.. పెళ్లికి వచ్చిన ఒక్కొక్క గిఫ్ట్ బాక్స్‌ను ఓపెన్ చేసి చూస్తున్నారు. ఇంతలో నవ వధువు మాజీ ప్రియుడు ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌ను వరుడు ఓపెన్ చేశాడు. ఇంకేముందు.. ఒక్కసారిగా దడేల్ మని భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి కొత్త పెళ్లి కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అతని కళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మణికట్టు విరిగిపోయింది. ఈ ఘటనలో వరుడు మేనళ్లుడు(3) కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపగా.. షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. నవ వధువు మాజీ ప్రియుడే ఈ చర్యకు పాల్పడినట్లు నిర్ధారించారు పోలీసులు. తన ప్రేయసి తనను కాదని వేరొకరిని పెళ్లి చేసుకుంటుందనే ఆగ్రహంతోనే ఈ ప్రతీకార చర్యకు పూనుకున్నట్లు తేల్చారు. నిందితుడైన రాజ్ ధన్‌సుఖ్ పటేల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు.