పీక్స్‌ చేరిన పిచ్చి.. ఈ కారణంతో కూడా ప్రాణాలు తీసుకుంటారా.?

Maharashtra: శాస్త్రసాంకేతిక రంగంలో మనిషి ఎంతో అభివృద్ధి చెందుతున్నాడు. నింగికి నిచ్చెన వేస్తూ ఇతర గ్రహాలపై నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి తహతహలాడుతున్నాడు. కానీ కొందరి ఆలోచనలు మాత్రం ఇంకా పాతాలంలోనే ఉంటున్నాయి...

పీక్స్‌ చేరిన పిచ్చి.. ఈ కారణంతో కూడా ప్రాణాలు తీసుకుంటారా.?
Follow us
Narender Vaitla

|

Updated on: May 18, 2022 | 7:16 AM

Maharashtra: శాస్త్రసాంకేతిక రంగంలో మనిషి ఎంతో అభివృద్ధి చెందుతున్నాడు. నింగికి నిచ్చెన వేస్తూ ఇతర గ్రహాలపై నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి తహతహలాడుతున్నాడు. కానీ కొందరి ఆలోచనలు మాత్రం ఇంకా పాతాలంలోనే ఉంటున్నాయి. చిన్న చిన్న కారణాలకే దేవుడిచ్చిన వందేళ్ల జీవితాన్ని అద్యాంతరంగా ముగించుకుంటున్నారు. ఎంత పెద్ద సమస్య అయినా ఆత్మహత్య పరిష్కారం కాదని చెబుతుంటారు. కానీ కొందరు మాత్రం సిల్లీ రీజన్స్‌కే తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని ముకుందన్‌ నగర్‌లో సామధాన్‌ సాబ్లే (24) అనే ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం అతనికి వివాహం అయింది. అయితే కొన్ని రోజులపాటు బాగానే ఉన్నా తర్వాత భార్య పట్ల అసంతృప్తిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తీరా అతని గదిని పరిశీలించగా పోలీసులకు సూసైడ్‌ లెటర్‌ కనిపించింది. అందులో సామధాన్‌ తాను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాన్ని ప్రస్తావించాడు.

ఆ రీజన్‌ చదివిన పోలీసులు షాక్‌ అయ్యారు. భార్య సరిగా చీర కట్టుకోలేకపోతోందని, సరిగ్గా నడవడం లేదని, మాట్లాడటం లేదని సామధాన్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే సామధాన్‌ తన కంటే వయసులో ఆరేళ్లు పెద్దదైన మహిళను వివాహం చేసుకున్నట్లు తెలిపిన ముకుంద్వాడీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్