Huzurabad By Election: హుజూరాబాద్ బైపోల్‌ కోసం టీఆర్ఎస్ దూకుడు.. ఏడేళ్ల పాలన వివరిస్తూ ఓటర్లకు కేసీఆర్ లేఖలు!

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కింది. రేపోమాపో నోటిఫికేషన్‌ వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీలు జోరు పెంచాయి

Huzurabad By Election: హుజూరాబాద్ బైపోల్‌ కోసం టీఆర్ఎస్ దూకుడు.. ఏడేళ్ల పాలన వివరిస్తూ ఓటర్లకు కేసీఆర్ లేఖలు!
Cm Kcr
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 11, 2021 | 10:53 AM

Huzurabad By Elections: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కింది. రేపోమాపో నోటిఫికేషన్‌ వస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీలు జోరు పెంచాయి. ఇవాళ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటిస్తారని తెలుస్తోంది. TRSV అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా సీఎం కేసీఆర్‌ నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ తర్వాత తొలిసారి ఇవాళ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ట్రబుల్‌ షూటర్ హరీష్‌రావు ఎంట్రీ ఇస్తున్నారు. ఇన్నాళ్లూ తెరవెను మంత్రాంగం నడిపిన ఆయన.. ఇప్పుడు డైరెక్టుగా ఫీల్డ్‌లోకి దిగుతున్నారు. ఈనెల 16న తలపెట్టిన సీఎం కేసీఆర్‌ సభ దిగ్విజయం చేసేందుకు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు హరీష్ రావు.

హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ అధిష్ఠానం అక్కడ విజయం సాధించేందుకు వీలుగా పలు వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే మంత్రులు, నేతలకు బాధ్యతలను అప్పగించింది. వారి ఆధ్వర్యంలో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అంతేకాదు దళితుల సమగ్రాభివృద్ధి కోసం ‘దళిత బంధు’ పథకాన్ని ఈ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా అమలుచేసేందుకు పూనుకుంది. తాజాగా ఆ నియోజకవర్గంలో గత ఏడు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ గులాబీ రంగు లేఖలు రాయాలని నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమా పథకాలను ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, విదేశీ విద్యానిధి తదితర పథకాల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులతోపాటు నియోజకవర్గంలోని ఇతర కుటుంబాలకూ వాటిని పంపాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు లక్షలకు పైగా లేఖలను సిద్ధం చేస్తోంది. నియోజకవర్గంలో తాజాగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలనూ లేఖల్లో జోడించనుంది. ఓటర్లు ఆలోచించి ప్రభుత్వానికి ఓటు రూపంలో మద్దతు తెలపాలని అందులో కోరనుంది. సీఎం కేసీఆర్‌ పర్యటన కంటే ముందే వాటిని బడ్వాడా చేసేలా పార్టీ వర్గాలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి.

Read Also…  Sandeep Reddy Vanga: మహేష్‌‌‌‌‌‌తో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. ఫ్యాన్స్‌‌‌కు పూనకాలే