AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: ఇంకోసారి కేసీఆర్‌పై రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్.. ఎమ్మెల్సీ కవిత వార్నింగ్!

తెలంగాణ రాష్ట్ర వ్యవ‌హారాల కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఫైర్ అయ్యారు. ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల వ‌ల్ల తెలంగాణ రాలేదని, కేసీఆర్, ప్రజా పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద‌న్నారు.

MLC Kavitha:  ఇంకోసారి కేసీఆర్‌పై రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్.. ఎమ్మెల్సీ కవిత వార్నింగ్!
Kavitha Fire On Manickam Tagore
Balaraju Goud
|

Updated on: Feb 14, 2022 | 3:15 PM

Share

MLC Kavitha fire on Manickam Tagore: తెలంగాణ(Telangana) రాష్ట్ర వ్యవ‌హారాల కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్‌పై టీఆర్ఎస్(TRS) ఎమ్మెల్సీ క‌విత ఫైర్ అయ్యారు. ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల వ‌ల్ల తెలంగాణ రాలేదని, కేసీఆర్(KCR), ప్రజా పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింద‌న్నారు. అది గిఫ్ట్ కాదు.. ప్రజాగ్రహనికి తలొగ్గి స్వరాష్ట్రం ఇచ్చారని ఎమ్మెల్సీ క‌విత తేల్చిచెప్పారు. నాటీ ఉద్యమ నాయకులు , సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా ఉద్యమం కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదన్నారు.

అహింసా మార్గంలో కేసీఆర్ గారు చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మీపై ఒత్తిడి పెరగడంవల్ల తెలంగాణ ఇచ్చారు కానీ అది ఎవరి భిక్ష కాదని కవిత తెలిపారు. ప్రజా పోరాటంలో ఆఖరికి సత్యమే గెలిచిందన్నారు. భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారని కవిత గుర్తు చేశారు. అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం అని క‌విత పేర్కొన్నారు. దయచేసి ఇంకోసారి కేసీఆర్ గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాల‌ని ఠాగూర్‌కు క‌విత హితవు పలికారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా మాణిక్యం ఠాకూర్‌పై మండిపడ్డారు.

Read Also… CM KCR Strategy: మోడీ పై అటాక్..రాహుల్ కు బాసట.. గులాబీ దళపతి పంథా మార్చబోతున్నారా..?