AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Strategy: మోడీ పై అటాక్..రాహుల్ కు బాసట.. గులాబీ దళపతి పంథా మార్చబోతున్నారా..?

తెలంగాణలో గత కొన్ని రోజులుగా రాజకీయ వాతావారణం వేడెక్కుతోంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

CM KCR Strategy: మోడీ పై అటాక్..రాహుల్ కు బాసట.. గులాబీ దళపతి పంథా మార్చబోతున్నారా..?
Kcr Political Strategy
Balaraju Goud
|

Updated on: Feb 14, 2022 | 3:06 PM

Share

TRS Chief KCR Political Strategy: తెలంగాణ(Telangana)లో గత కొన్ని రోజులుగా రాజకీయ వాతావారణం వేడెక్కుతోంది. టీఆర్ఎస్(TRS), బీజేపీ(BJP)ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సమతామూర్తి కేంద్రంలో నెలకొల్పిన శ్రీరామానుజచార్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలకలేదు. జ్వరం కారణంగా కేసీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని టీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో రెండు పార్టీల మధ్య ఒకరినొకరు అవాక్కులు చవాక్కులు పేలుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే రెండు బహిరంగ సభలు..రెండు మీడియా సమావేశాలు.. భారతీయ జనతా పార్టీ టార్గెట్ గా గులాబీ బాస్ కేసీఆర్ ఈ నాలుగు సందర్భల్లో పేల్చిన తూటాలపై జనం ఏమనుకుంటున్నారూ.. కాంగ్రెస్ పెద్ద రాహుల్ గాంధీకి బాసటగా నిలవడం పట్ల ప్రజల్లో ఏం చర్చ జరుగుతుంది.. కేసీఆర్ నయా స్ట్రాటజీ జనాలకు ఎక్కిందా అసలు గ్రౌండ్ లో ఏం జరుగుతోంది..ఇప్పుడు ఇదే అంశంపై గులాబీ బాస్ తెలంగాణ ప్రజల నాడీ పట్టే పనిలో పట్టారు.

ముఖ్యంగా పబ్లిక్ మూడ్ పై కేసీఆర్ ఫోకస్ పెట్టారు.. వరుసగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై నిప్పులు చేరుగుతూ ప్రజల్లో కేంద్రం అన్యాయం చేస్తుందని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్..రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంతో పాటు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు.. కేంద్రం స్థాయిలో అవినీతి జరుగుతుంది అంటూ తూర్పారపడుతున్నారు కేసీఆర్. అటు బహిరంగ సభల్లో.. ఇటు ప్రగతి భవన్ వేదిక పెడుతున్న మీడియా సమావేశాలు ఎంతవరకు వర్కవుట్ అవుతుందని ఆరా తీయ్యడం మొదలు పెట్టారంట గులాబీ దళపతి.

కేంద్రం ను ప్రధాని మోడీని టార్గెట్ చేయడంతో పాటు రాహుల్ గాంధీకి బాసటగా నిలుస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా, రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడుతున్న మాటలపై ప్రజలతో పాటు అటు ప్రతిపక్ష పార్టీల్లో ఎలాంటి చర్చ జరుగుతుందన్న దానిపై కేసీఆర్ డిటెయిల్‌గా సర్వే చేయిస్తున్నారంట.. ఈ క్రమంలో దేశంలోనే ప్రముఖ సంస్థకు ఈ బాధ్యతలు అప్పగించినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. వారం రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ టీమ్ పర్యటించి ప్రజల నాడిపై సర్వే చేయనున్నారు. టీఆర్ ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది బీజేపీని టార్గెట్ చెయ్యడాన్నీ జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు..పార్లమెంట్ లో మోడీ రాష్ట్ర విభజన పై మాట్లాడిన మాటలపై ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉంది..ఇలాంటి అంశాలపై సర్వే చేసి ఆ రిపోర్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా మధ్యకాలంలో బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో కేసీఆర్ పంథాపై ప్రజల స్పందన కు సంబంధించిన సర్వే రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ మరింత డోస్ పెంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తోంది.

—- శ్రీధర్ ప్రసాద్, టీవీ 9 ప్రతినిధి, హైదరాబాద్.

Read Also…  Medaram Jatara 2022: తెలంగాణ కుంభమేళాకు మొదలైన భక్తుల తాకిడి.. ఈనెల 18న మేడారం జాతరకు సీఎం కేసీఆర్