MLC Kavitha: బీజేపీపై తిరుగబాటుకు దేశాన్ని ఏకం చేస్తాం.. తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశంలో తెస్తాం- ఎమ్మెల్సీ కవిత..
బీజేపీయేతర రాష్ట్రాలను కూల్చేయడం అప్రజాస్వామికమన్నారు. విపక్షాలు అనుకుంటే చాలు వాళ్లపై ఎటాక్ చేస్తున్నార.. లేనిపోని లీకులిచ్చి వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
బీజేపీ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన తెలంగాణ జాగృతి సమావేశం జరిగింది. ఇందులో భాగంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో వ్యక్తులను, వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. బీజేపీయేతర రాష్ట్రాలను కూల్చేయడం అప్రజాస్వామికమన్నారు. విపక్షాలు అనుకుంటే చాలు వాళ్లపై ఎటాక్ చేస్తున్నార.. లేనిపోని లీకులిచ్చి వ్యక్తిత్వహననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ వైఫల్యాల్ని ఎత్తి చూపుతున్న వారిని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై యువతలో చైతన్యం రావాలన్నారు. సిస్టంను మనం కాపాడితే ఆ సిస్టం మనల్ని కాపాడుతుందని కవిత అన్నారు.
దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు జరుగుతున్నాయని.. ఈ దాడులకు భయపడేది లేదని కవిత అన్నారు. ఏజెన్సీలతో సమయం వృధా తప్ప ఉపయోగంలేదన్నారు. ఆడపిలల్లను బాధపెడితే కన్నీళ్లు వస్తాయి కావొచ్చు కానీ తెలంగాణ ఆడబిడ్డల కళ్ళలో నుంచి కన్నీళ్లు కాదు నిప్పులు వస్తాయని అన్నారు. “వి డోంట్ కేర్.. వెనక్కి తగ్గేది” లేదన్న కవిత అన్నారు.
సమస్య ఉన్నప్పుడు మాట్లాడే చైతన్యం తెలంగాణలో ఉందన్నారు. ఇక ఇదే చైతన్యం దేశంలో తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడుందన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కవులను, కళాకారులను, రచయితలను ఏకం చేద్దామని కవిత పిలుపునిచ్చారు.
నేడు జాగృతి గొంతు తక్కువే కానీ భావజాల వ్యాప్తి జరిగాక అందరికి తెలుస్తుందన్నారు. ఒక్క పిలుపుతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాగృతిశాఖ ఏర్పాటు చేసే శక్తి జాగృతికి ఉందన్నారు. నాపై మాత్రమే ఏజెన్సీల దాడులు జరగడం లేదని.. జమ్మూ నుంచి కశ్మీర్ వరకు కేంద్ర ప్రభుత్వం దాడులు జరుపుతోందన్నారు. మనపై జరిగిన దాడికి ట్రిపుల్ పనులు మనం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం