TRS MLAs poaching case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ.. మరి కాసేపట్లో..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో సంచలనాలు బటయకు వస్తున్నాయి. సేకరించిన ఆధారాలతో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు ప్రలోభాలకు గురిచేసినట్టు పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో సంచలనాలు బటయకు వస్తున్నాయి. సేకరించిన ఆధారాలతో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు ప్రలోభాలకు గురిచేసినట్టు పేర్కొన్నారు. ఆధారాల కోసం రహస్య కెమెరాలు, వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు తెలిపారు. హాల్‌లో రహస్య కెమెరాలు, రోహిత్‌రెడ్డి జేబులో 2వాయిస్ రికార్డర్లు ఉన్నట్లు వెల్లడించారు. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని రిమాండ్‌కి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ పై ఈ రోజు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. నిందితులను రిమాండ్ కు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసుల వాదనలు వినిపించనున్నారు. పక్కా ప్లాన్ తో తెలంగాణ ఎమ్మెల్యేలకు కొనుగోలుకు ప్రయత్నించిన ఆధారాలున్నాయంటూ కోర్టు ముందు వాసుల వినిపించిన పోలీసులు.. ముందస్తు సమాచారంతో ఆపరేషన్ చేసినట్టు కోర్టుకు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో నిందితుల కస్టడీపై తెలంగాణ హైకోర్టు మరికాసేపట్లో తీర్పు ఇవ్వనుంది.
ఈ మేరకు పోలీసులు.. మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసులో కోర్టుకు పూర్తి నివేదికను అందించేందుకు.. రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. ఫాంహౌస్‌లో మ. 3.10కి రహస్య కెమెరాలు ఆన్ చేశామని నివేదికలో స్పష్టం చేశారు. సాయంత్రం 4.10కి గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులు వచ్చారన్నారు.దాదాపు మూడున్నర గంటల పాటు ఆ ముగ్గురితో Mlaలు చర్చించినట్టు నివేదికలో పేర్కొన్నారు. మీటింగ్ అయ్యాక కొబ్బరి నీళ్లు తీసుకు రా అని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్‌రెడ్డికి ముందే చెప్పామని, ఆ సిగ్నల్ వచ్చిన వెంటనే లోపలికి వెళ్లి.. రామచంద్ర, నందు, సింహయాజిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఎమ్మెల్యేను ప్రలోభపెట్టారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు 24 గంటల వరకు నగరాన్నివిడిచి వెళ్లరాదంటూ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ, కోరె నందకుమార్ అలియాస్ నందు, సింహయాజిలు తమ ఇంటి అడ్రస్‌లను సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు అందజేయాలని సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..