Viral Video: వారి ఆరోగ్య రహస్యం ఎలుక మాంసం అట.. లొట్టలేసుకుంటూ తింటున్న వీడియో..
తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి. ఇదే రీతిలో తింటే ఎలుకలు తినాలి.. ఆ రుచి అనుభవం పొందాలి అంటున్నారు ఈ మారుమూల ఏజెన్సీ ఆదివాసీలు. ఏమిటా ఎలుకల మాంసం రుచి.? ఏమిటా వారి ఆరోగ్య సీక్రెట్ అని తెలుసుకోవాలంటే వివరాలు చదివేయాల్సిందే. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కొందరు ఆదివాసీలు ఎలుకల మాంసాన్ని తమ ఆహారంగా చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. అది ఎంతో రుచిగా ఉండి.. ఉల్లాసంతో పాటు మంచి జోష్ పెంచుతుందని చెబుతున్నారు. ఈ మాంసం తినడం వల్ల శరీరంలో ఉత్తేజాన్ని కలిగిస్తుందని ఆదివాసిలు తెలుపుతున్నారు.

తింటే గారెలు తినాలి.. వింటే భారతం వినాలి. ఇదే రీతిలో తింటే ఎలుకలు తినాలి.. ఆ రుచి అనుభవం పొందాలి అంటున్నారు ఈ మారుమూల ఏజెన్సీ ఆదివాసీలు. ఏమిటా ఎలుకల మాంసం రుచి.? ఏమిటా వారి ఆరోగ్య సీక్రెట్ అని తెలుసుకోవాలంటే వివరాలు చదివేయాల్సిందే. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కొందరు ఆదివాసీలు ఎలుకల మాంసాన్ని తమ ఆహారంగా చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు. అది ఎంతో రుచిగా ఉండి.. ఉల్లాసంతో పాటు మంచి జోష్ పెంచుతుందని చెబుతున్నారు. ఈ మాంసం తినడం వల్ల శరీరంలో ఉత్తేజాన్ని కలిగిస్తుందని ఆదివాసిలు తెలుపుతున్నారు. అయిదుగురు ఆదివాసీలు ఒక బృందంగా ఏర్పడి ఎలుకలు సంచరిస్తున్న ప్రాంతాన్ని గుర్తించి.. ఆ ఎలుకలు ఎంత పెద్ద బొక్కల్లో ఉన్నా.. వెంటాడి మరీ పట్టుకొని ఎలుకలను తమ ఆహారంగా మలుచుకుంటున్నారు.
అడవుల్లో, కొండ బొక్కల్లో దాక్కొని ఉండే ఎలుకలను పట్టి తమకు ఇష్టమైన రీతిలో వంట చెరకు మంటలో కాల్చుకుని తింటున్నారు. ముందుగా రోటిపై నూరిన పచ్చిమిర్చిలో పసుపు, కారం, ఉప్పుతో వండిన సూపును వేటకు వెళ్లిన టీం అంతా కూర్చుని జుర్రున తాగేస్తున్నారు. అనంతరం మిగిలిన ఎలుక మాంసాన్ని లొట్టలేసుకుంటూ తింటున్నారు. ఆహా ఏమి రుచి అంటూ వారు ఆనంద డోలికల్లో మునుగుతున్నారు ఆదివాసీలు. ఎలుక మాంసంలో ఉన్న రుచి మరి ఎందులో కూడా దొరకదు అని వారు వెల్లడించడం గమనార్హం. సంవత్సరంలో రెండు సార్లు అయినా సరే ఎలుకల కోసం వేటకు వెళ్తామని ఆ ఆదివాసీలు తెలుపుతున్నారు. ఆరోగ్యంగా, దృఢంగా ఉంటామని అనేక రోగాలకు సైతం ఎలుక మాంసం నివారణగా ఉంటుందని వారు తెలుపుతున్నారు. తరతరాలుగా తాము ఈ ఎలుకల మాంసాన్ని తీసుకుంటున్నామని ఆ ఆదివాసిలు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




