ఒకవైపు సిగపట్లు.. మరోవైపు రక్తధారలు.. ఇరువర్గాల మధ్య ఘర్షణ.. అసలు కారణమిదే..

మేడారం వెళ్లే ప్రతి భక్తులు మొదట ములుగు శివారులోని గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుంటారు. తొలి మొక్కు గట్టమ్మకు సమర్పిస్తారు. ఆ ఘట్టమ్మ దేవాలయమే ఇప్పుడు వివాదానికి కేరాఫ్ అడ్రస్‎గా మారింది. రెండు వర్గాల మధ్య అగ్గిరాజుకునేలా చేసింది. ఘట్టమ్మ సాక్షిగా రక్తం చిందేలా చేసింది. గట్టమ్మ దేవత మాదంటే మాదే అంటూ ముదిరాజ్ వర్గం - నాయకపోడు సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు తన్నుకున్నారు. దేవాలయం సన్నిధిలోనే సిగపట్లు పట్టుకున్నారు. చివరకు రక్తం చిందించారు. ఒకప్పుడు ఈ దేవాలయాన్ని ఎవరూ పట్టించుకునే వారు కాదు.

ఒకవైపు సిగపట్లు.. మరోవైపు రక్తధారలు.. ఇరువర్గాల మధ్య ఘర్షణ.. అసలు కారణమిదే..
Gattamma Temple
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 05, 2024 | 10:22 AM

మేడారం వెళ్లే ప్రతి భక్తులు మొదట ములుగు శివారులోని గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుంటారు. తొలి మొక్కు గట్టమ్మకు సమర్పిస్తారు. ఆ ఘట్టమ్మ దేవాలయమే ఇప్పుడు వివాదానికి కేరాఫ్ అడ్రస్‎గా మారింది. రెండు వర్గాల మధ్య అగ్గిరాజుకునేలా చేసింది. ఘట్టమ్మ సాక్షిగా రక్తం చిందేలా చేసింది. గట్టమ్మ దేవత మాదంటే మాదే అంటూ ముదిరాజ్ వర్గం – నాయకపోడు సామాజిక వర్గానికి చెందిన గిరిజనులు తన్నుకున్నారు. దేవాలయం సన్నిధిలోనే సిగపట్లు పట్టుకున్నారు. చివరకు రక్తం చిందించారు. ఒకప్పుడు ఈ దేవాలయాన్ని ఎవరూ పట్టించుకునే వారు కాదు. మేడారం సమ్మక్క సారక్క జాతర వల్ల గట్టమ్మ దేవాలయానికి ప్రాధాన్యత సంతరిచుకుంది. ఈ మధ్యకాలంలో గట్టమ్మ దేవాలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.

ప్రస్తుతం నాయకపోడు సామాజిక వర్గంవారు గట్టమ్మ దేవాలయం వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. జాతర సమయంలో ఉత్సవాలు కూడా నాయకపోడు సామాజిక వర్గం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఎదురు పిల్ల పండుగతో పాటు ఇతర కార్యక్రమాలను నాయకపోడు సామాజిక వర్గం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. అయితే జాకారం గ్రామానికి చెందిన ముదిరాజ్ వర్గం గట్టమ్మ మా దేవత.. మేం ప్రతిష్టించుకున్న దేవతను మీరెలా స్వాధీనం చేసుకున్నారని ఎదురు తిరిగారు. కోర్టును ఆశ్రయించారు. మా గుడిని మాకు అప్పచెప్పాలని, మేం ప్రతిష్టించుకున్న దేవత వద్ద మీ పెత్తనం ఏంటని గట్టమ్మ గుడిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో నాయకపోడు – ముదిరాజ్ వర్గం మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఘట్టమ్మ సాక్షిగా రెండు వర్గాలు తన్నుకున్నారు. రక్తం చిందించారు. చివరకు ఘట్టమ దేవాలయం ఇప్పుడు పోలీసుల ఆధీనంలో ఉంది. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు ప్రస్తుతం గట్టమ్మ దేవాలయాన్ని వారి ఆధీనంలో తీసుకున్నారు. ఘట్టమ్మ దేవత ఎవరు..? ఏ వంశానికి చెందిన దేవత అని తేల్చేందుకు ఇరువర్గాల ప్రజలు పూజారులు తలపట్లు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
శ్రీలీల హిట్ కొట్టాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనా..
శ్రీలీల హిట్ కొట్టాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనా..
ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంపు..
ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంపు..
అందం, వయ్యారాలు ఫుల్లు.. కానీ అవకాశాలు మాత్రం నిల్లు..
అందం, వయ్యారాలు ఫుల్లు.. కానీ అవకాశాలు మాత్రం నిల్లు..
రాత్రి సమయంలో అడవిలో కనువిందు చేసే అందాలు.. భారతదేశ మాయా అడవి
రాత్రి సమయంలో అడవిలో కనువిందు చేసే అందాలు.. భారతదేశ మాయా అడవి
రష్యా సైనికుల కాళ్లకు బీహార్ మహిళలు చేసిన బూట్లు..
రష్యా సైనికుల కాళ్లకు బీహార్ మహిళలు చేసిన బూట్లు..
అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన భారత బౌలర్లు వీరే
అంతర్జాతీయ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన భారత బౌలర్లు వీరే
నన్ను వదిలేయండి.. పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ సీరియస్..
నన్ను వదిలేయండి.. పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ సీరియస్..
పుచ్చకాయల సాగుతో అదిరిపోయే లాభాలు.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో..
పుచ్చకాయల సాగుతో అదిరిపోయే లాభాలు.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మారిన బెంగళూరు వెదర్ రిపోర్ట్..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మారిన బెంగళూరు వెదర్ రిపోర్ట్..
అర్థరాత్రి కుక్కలను చంపిన కిరాతకుడు.. ఎందుకంటే..?
అర్థరాత్రి కుక్కలను చంపిన కిరాతకుడు.. ఎందుకంటే..?