AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్కార్ కొలువు.. మంచి నీళ్లు తాగినంత సులువు.. ఒకేసారి 5 ఉద్యోగాలు

ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో.. ఒకేసారి అయిదు ఉద్యోగాలు సాధించారు ఖమ్మం జిల్లాకు చెందిన యువతులు శ్రుతి, వినీల. ఖమ్మం నగరంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొలపుడి శ్రుతి ఒకేసారి అయిదు ఉద్యోగాలు సాధించారు. శ్రుతి తండ్రి పెయింటింగ్ వర్క్ చేస్తుండగా తల్లి పోలీస్ శిక్షణ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. ఇంటర్ వరకు గురుకులంలో చదివిన శ్రుతి ఓ.యులో ఉన్నత విద్య పూర్తిచేశారు.

సర్కార్ కొలువు.. మంచి నీళ్లు తాగినంత సులువు.. ఒకేసారి 5 ఉద్యోగాలు
Khammam Women
N Narayana Rao
| Edited By: Srikar T|

Updated on: Mar 05, 2024 | 9:54 AM

Share

ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో.. ఒకేసారి అయిదు ఉద్యోగాలు సాధించారు ఖమ్మం జిల్లాకు చెందిన యువతులు శ్రుతి, వినీల. ఖమ్మం నగరంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొలపుడి శ్రుతి ఒకేసారి అయిదు ఉద్యోగాలు సాధించారు. శ్రుతి తండ్రి పెయింటింగ్ వర్క్ చేస్తుండగా తల్లి పోలీస్ శిక్షణ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. ఇంటర్ వరకు గురుకులంలో చదివిన శ్రుతి ఓ.యులో ఉన్నత విద్య పూర్తిచేశారు. ఒకే సారి ఎక్సైజ్ కానిస్టేబుల్, గురుకుల స్కూల్ లైబ్రేరియన్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఈ.ఓ తో పాటు గురుకుల డిగ్రీ కాలేజీ లెక్చరర్, టి ఎస్ పి ఎస్సీ జే ఎల్ లైబ్రేరియన్‎గా ఉద్యోగాలు సాధించారు శ్రుతి. ఒకేసారి అయిదు ఉద్యోగాలు సాధించిన శ్రుతిని ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్‎తో పాటు పలువురు అధికారులు అభినందించారు.

ఖమ్మం నగరంలోని టేకులపల్లికి చెందిన వినీల అనే యువతి కూడా ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించారు. అయిదో ఉద్యోగానికి కూడా క్వాలిఫై అయ్యారు కానీ తను ఆ ఇంటర్వ్యూకు హాజరు అయితే వేరే వాళ్లకు ఉద్యోగం పొందే అవకాశం కోల్పోతారని ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు వినీల. వినీల తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఇద్దరు ఆడపిల్లల చదువు భారం మొత్తం తల్లి వెంకట లక్ష్మి మీద పడింది. తల్లి కష్టం చూడలేక అక్క చెల్లెళ్ళు వినీల, వివేక కూడా కష్టపడి చదివారు. నాలుగైదు ఉద్యోగాలు సాధించిన యువతుల కుటుంబంలో మగ పిల్లలు లేరు. రెండు కుటుంబాల వారికి ఆడ పిల్లలే ఉండడం విశేషం. ఖమ్మం నగరానికి చెందిన ఇద్దరు యువతులు ఒకేసారి నాలుగైదు ఉద్యోగాలు సాధించడంతో వారిని పలువురు అభినందిస్తున్నారు. కష్టపడి పట్టుదలతో చదివితే ఏదైనా సాధించవచ్చని ఈ పేదింటి యువతులు నిరూపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..