AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టం.. రేవంత్ పై కవిత ఫైర్!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామంలో పర్యటించారు. ఆ గ్రామానికి చెందిన హర్యల వెంకట్ బోధన్ హాస్టల్ లో మృతి చెందడం పట్ల ఆమె తను బాధను వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ లేకపోవడం ఒకరు చనిపోవడం ఎనిమిది మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం దురదృష్టం.. రేవంత్ పై కవిత ఫైర్!
MLC Kavitha
Balu Jajala
|

Updated on: Mar 05, 2024 | 3:39 PM

Share

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తిప్పారం గ్రామంలో పర్యటించారు. ఆ గ్రామానికి చెందిన హర్యల వెంకట్ బోధన్ హాస్టల్ లో మృతి చెందడం పట్ల ఆమె తను బాధను వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్ లేకపోవడం ఒకరు చనిపోవడం ఎనిమిది మంది విద్యార్థులపై మర్డర్ కేసు నమోదైందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఎనిమిది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, పట్టింపులేని చర్యల వల్లనే ఈ సంఘటన జరిగిందని కవిత ఆరోపించారు. సీఎం కేసీఅర్ పై పడి ఎడ్చుడే తప్ప ఈ మూడు నెలల్లో ప్రజలకు చేసిందేమీ లేదు అని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు విద్య శాఖకు మంత్రి లేకపోవడం మన దురదృష్టం అని కవిత మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా రివ్యూ నిర్వహించి పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రేవంత్ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు.

మృతుని తల్లికి పెన్షన్, సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం, 15 లక్షల నష్టపరిహారం, ఒక డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. RSS మూలాలు ఉన్న రేవంత్ ప్రధాని మోడీని పెద్దన్న అనడంలో అతిశయోక్తి లేదు అని, కానీ తెలంగాణ కి బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించకపోవడం పై ఎందుకు ప్రశ్నించలేదు? అని కవిత అన్నారు. రాష్ట్రంలో వరుస ఆత్మహత్యలు జరుగుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?