PM Modi Tour: ప్రధాని పర్యటన నేపథ్యంలో నిఘా నీడలో హైదరాబాద్ -వరంగల్ హైవే.. కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహణ
నేడు ప్రధాని మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై పోలీసుల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎస్ఎస్ జీ బృందాలు జాతీయ రహదారిపై కాన్వాయ్ ట్రయల్ రన్ ను నిర్వహించారు. మరోవైపు హైవేపై వాహనాలు నిలపకుండా పోలీసుల పెట్రోలింగ్ చేపట్టారు

30 సంవత్సరాల తర్వాత దేశ ప్రధాని ఓరుగల్లు గడ్డపైన కాలు మోపబోతున్నారు.. మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఓరుగల్లు పులకరించిపోతుంది. మోడీ పర్యటనలో భద్రకాళి అమ్మవారి దర్శనం ప్రత్యేకత సంతరించుకుంది.. అయితే ప్రధాని మోడీ తో పాటు భద్రకాళి అమ్మవారిని మరికొందరు నేతలు దర్శించుకోనున్నారు. దీంతో ప్రోటోకాల్ ప్రకారం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం భద్రకాళి అమ్మవారి ఆలయం SPG వలయంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంది.
నేడు ప్రధాని మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై పోలీసుల ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎస్ఎస్ జీ బృందాలు జాతీయ రహదారిపై కాన్వాయ్ ట్రయల్ రన్ ను నిర్వహించారు. మరోవైపు హైవేపై వాహనాలు నిలపకుండా పోలీసుల పెట్రోలింగ్ చేపట్టారు. వాస్తవానికి ప్రధాని మోడీ వరంగల్ ప్రత్యేక విమానంలో చేరుకోవాల్సి ఉంది. అయితే వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడి.. వాతావరణం అనుకూలించకపోతే ప్రధాని మోడీ రోడ్డు మార్గాన ప్రయాణిస్తూ వరంగల్ చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులుపోలీసు సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. హైవేపై భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
