AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నేడు తెలంగాణకు ప్రధాని.. కాసేపట్లో హకీంపేట్‌ చేరుకోనున్న మోదీ.

వరంగల్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో మోదీ తెలంగాణకు రానున్నారు. ఉదయం 9.25 గంటలకు హకీంపేట ఎయిర్‌ పోర్టుకు చేరుకోనున్నారు. హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఏర్పాట చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ...

PM Modi: నేడు తెలంగాణకు ప్రధాని.. కాసేపట్లో హకీంపేట్‌ చేరుకోనున్న మోదీ.
Pm Modi (File Photo)
Narender Vaitla
|

Updated on: Jul 08, 2023 | 6:41 AM

Share

వరంగల్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో మోదీ తెలంగాణకు రానున్నారు. ఉదయం 9.25 గంటలకు హకీంపేట ఎయిర్‌ పోర్టుకు చేరుకోనున్నారు. హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఏర్పాట చేసిన కార్యక్రమాల్లో పాల్గొననున్న మోదీ అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ నేతలు మొదలు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. ప్రస్తుతం వారణాసిలో ఉన్న ప్రధాని మోదీ.. ఉదయం 7.35 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.

అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌లోని మామునూరు చేరుకుంటారు. మొదట భద్రకాళి దేవాలయానికి వెళ్లనున్న ప్రధాని అక్కడ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం హన్మకొండ ఆర్ట్స్‌ కాలేజీలో మైదానంలో బహిరంసభలో పాల్గొంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని సభా వేదిక నుంచే శంకుస్థాపన చేస్తారు. తర్వాత సభలో ప్రసంగించనున్న మోదీ.. మధ్యాహ్నం 12.20 తర్వాత హెలికాప్టర్‌లో హకీంపేట్‌ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌ వెళ్లనున్నారు.

ఇదిలా ఉంటే ప్రధానీ మోదీ పర్యటనకు తాము దూరంగా ఉంటున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మోదీ సభను తాము బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇక మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వరంగల్‌ చుట్టూ 144 సెక్షన్‌ అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్