మూడు రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడు.. మిస్సింగ్ వెనుక ఊహించని మిస్టరీ..!
అత్యంత దారుణమైన సంఘటన ఇది.. ట్రాక్టర్ ఢీకొని మృతిచెందిన బాలుడిని అదే ట్రాక్టర్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..! అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఎవరు గమనించకుండా ఆ బాలుడి మృతదేహాన్ని ఓ బస్తా సంచిలో మూటకట్టి గ్రామానికి దూరంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టిలో పాతి పెట్టాడు.

అత్యంత దారుణమైన సంఘటన ఇది.. ట్రాక్టర్ ఢీకొని మృతిచెందిన బాలుడిని అదే ట్రాక్టర్ డ్రైవర్ ఏం చేశాడో తెలుసా..! అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఎవరు గమనించకుండా ఆ బాలుడి మృతదేహాన్ని ఓ బస్తా సంచిలో మూటకట్టి గ్రామానికి దూరంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టిలో పాతి పెట్టాడు. ట్రాక్టర్ యాక్సిడెంట్ గమనించిన ఒకరు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బాలుడు అదృశ్యమైన మూడు రోజుల తర్వాత అసలు కథ బయటపడింది. బాలుడు డెడ్ బాడీని బయటకు తీసిన పోలీసులు, ఆ పాపిష్టి డ్రైవర్ ను అరెస్టు చేశారు
ఈ దారుణ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట గ్రామంలో జరిగింది. రాజేష్ అనే ఐదేళ్ల బాలుడు మూడు రోజుల నుండి కనిపించకుండా పోయాడు. ఆ బాలుడు ఏమైపోయాడో తెలియక హైరానా పడిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బాలుడు మిస్సింగ్ మిస్టరీపై విచారణ చేపట్టిన పోలీసులు ఊహించని ట్విస్ట్ గుర్తించారు.
గంపల శంకర్ అనే డ్రైవర్.. ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆ బాలుడికి యాక్సిడెంట్ అయింది. బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్ అవుతున్న క్రమంలో గ్రామాల్లో ఒకరు గమనించారు. ఆ బాలుడిని అదే ట్రాక్టర్‌లో తన వెంట తీసుకు వెళ్తుoడండంతో ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు కావచ్చని భావించారు. కానీ ఆ బాలుడి ఆచూకీ కనిపించలేదు ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు బాలుని ట్రాక్టర్ డ్రైవర్ ఢీకొట్టిన విషయం గుర్తించారు. వెంటనే ఆ ట్రాక్టర్ డ్రైవర్ శంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు కథ బయటపడింది.
ట్రాక్టర్ కింద పడి చనిపోయిన బాలుడు రాకేష్ మృతదేహాన్ని బస్తాలో కట్టి సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సమీపంలో మట్టిలో పాతిపెట్టినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్ శంకర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బాలుడి మిస్సింగ్ మిస్టరీకి తెర దించారు. బస్తాలో కట్టి మట్టిలో పాతిపెట్టిన బాలుడి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
