Telangana Congress: మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఎవరికీ..? ఢిల్లీలో జోరుగా లాబీయింగ్..! అందుకేనా ఆలస్యం..
తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు అభ్యర్థి ప్రకటన డైలీ సీరియల్‌ని తలపిస్తుంది.. ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న నలుగురిని పిలిచి అభ్యర్థిగా ఎవరి పేరును ఫైనల్ చేసినా.. అందరూ కలిసిమెలసి పని చేయాలని సూచించారు.

మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన ఉత్కంఠ రేపుతోంది. ఫైల్ ఢిల్లీ చేరినా.. ఆలస్యం ఎందుకవుతోంది..? అభ్యర్థి ప్రకటనపై ఢిల్లీలో జోరుగా లాబీయింగ్‌లు జరుగుతున్నాయా..? అభ్యర్థి తానేనంటూ ప్రచారం చేసుకుంటున్న కృష్ణరెడ్డి ఆశలు ఆశలు ఫలిస్తాయా..? లేక పాల్వాయి స్రవంతికి హస్తం.. అభయ హస్తం ఇస్తుందా? అభ్యర్థి ప్రకటనపై కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటి..? అనేవి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి..
Munugode bypoll congress candidate: తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు అభ్యర్థి ప్రకటన డైలీ సీరియల్‌ని తలపిస్తుంది.. ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న నలుగురిని పిలిచి అభ్యర్థిగా ఎవరి పేరును ఫైనల్ చేసినా.. అందరూ కలిసిమెలసి పని చేయాలని సూచించారు. రేసులో పాల్వాయి స్రవంతి, చలిమల కృష్ణారెడ్డి, పల్లె రవి, కైలాష్ నేతల పేర్లు ప్రధానంగా వినిపించినప్పటికీ అందులోని ఇద్దరి పేర్లను అదిష్టానం వద్దకి పీసీసి పంపింది. పాల్వాయి స్రవంతికి సీనియర్ల మద్దతుతో పాటు సర్వే ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మునుగోడులో పాల్వాయి స్రవంతి తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన కుటుంబం కావడంతో క్యాడర్ కూడా సపోర్ట్ చేస్తారని ఆలోచిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్, బీజేపీలను ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలంగా ఉన్న కృష్ణారెడ్డి వైపు పీసీసీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఇద్దరి పేర్లను పీసీసి హైకమాండ్‌కి పంపించడంతో తుది ప్రకటన మాత్రమే మిగిలుంది. ఇక అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరు దాదాపు ఖరారైందని పార్టీ నేతలు కూడా భవిస్తుండడంతో మరో ఆశావహ నేత చలిమల కృష్ణారెడ్డి ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు టికెట్ తనకే కేటాయించాలని ఏఐసీసీ పెద్దల ద్వారా లాబీయింగ్ జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు కృష్ణరెడ్డికి మద్దతు ఇస్తే తమేవరం సపోర్ట్ చేయమని ఇతర ఆశావహులు భీష్మించుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఇస్తే తమ ముగ్గురు లో ఎవరికి వచ్చిన పర్వాలేదని అసలు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎప్పుడూ పాల్గొనని కృష్ణరెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని మిగిలిన అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కృష్ణారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుండడం వల్లే అభ్యర్థి ప్రకటన ఆగిందని గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నాయి.




మునుగోడు అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వెళ్తుంది. అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరు దాదాపు ఖరారు అయినప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ గానీ రాలేదు. కావున ఒకవేళ అభ్యర్థి పేరు ప్రకటిస్తే ఇతరులు చేజారే అవకాశం ఉందని పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతుందట. నోటిఫికేషన్ రాగానే అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తున్నారు. అప్పటివరకు ఈ నలుగురు ప్రచారం చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
మునుగోడు అభ్యర్థి ప్రకటన ఆలస్యం అవుతుండడం ఢిల్లీ లాబీయింగ్ జరుగుతుండడంతో చివరి నిముషంలో పేరు మారుతుందా..? సునీల్ సర్వేకి ప్రాధాన్యత ఇస్తారా లేక ఆర్థిక బలానికి ప్రాధాన్యత ఇచ్చి టికెట్ కేటాయిస్తారో చూడాలంటున్నారు.. రాజకీయ పరిశీలకులు..
– అశోక్, టీవీ9 రిపోర్టర్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
