AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: ఆశ దోశ అప్పడం వడ..! పండక్కి పదవులు లేనట్టేనా.. టీపీసీసీ చీఫ్ ఏమన్నారో తెలుసా..?

ఆశదోశ అప్పడం వడ.. అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్‌ నేతల పరిస్థితి. పండక్కి వస్తాయనుకున్న పదవులు.. ఇప్పట్లో దక్కేలా లేవు. ఈ విషయంలో పీసీసీ చీఫ్‌ క్లారిటీ ఇవ్వడంతో... ఉసూరుమంటున్నారు ఆశావహులు..

Telangana Congress: ఆశ దోశ అప్పడం వడ..! పండక్కి పదవులు లేనట్టేనా.. టీపీసీసీ చీఫ్ ఏమన్నారో తెలుసా..?
Telangana Congress
Shaik Madar Saheb
|

Updated on: Oct 12, 2024 | 9:23 AM

Share

పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీలో.. ఇప్పుడు పదవుల పందేరం కీలకంగా మారింది. ఇప్పటికే కొన్ని భర్తీకాగా, మిగిలిన నామినేటెడ్‌ పోస్టుల కోసం.. ఇటు కొత్త పీసీసీ కార్యవర్గంలో చోటుకోసం.. నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో తాజాగా, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌.. టీపీసీసీ కమిటీల ఏర్పాటు ఇప్పట్లో లేనట్లేనన్న క్లారిటీని… మహేష్‌కుమార్ గౌడ్ ఒక హింట్‌ రూపంలో ఇచ్చారు. కమిటీల ఏర్పాటుకు సమయం పట్టొచ్చన్న సంకేతం ఇచ్చారు. పండగ తర్వాతే జిల్లాల పర్యటన.. ఆ తర్వాతే నియామకాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈనెల 15, 16 తేదీల్లో రెండు జిల్లాల చొప్పున పర్యటించనున్నట్టు తెలిపారు పీసీసీ చీఫ్‌. మిగతా అన్ని జిల్లాల్లోనూ పర్యటించిన తర్వాతే పార్టీ పదవుల నియామకాలు పూర్తిచేస్తామని తెలిపారు.

కార్పోరేషన్‌ పదవుల విషయంలో మాత్రం.. పెద్దగా ఆలస్యం కాకపోవచ్చని చెప్పారు పీసీసీ అధ్యక్షుడు. మిగిలిపోయిన నామినేటెడ్‌ పోస్టులను.. త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. కార్పోరేషన్‌ పోస్టుల భర్తీ ఎన్నికల కారణంగా వాయిదా పడిందన్న మహేష్‌కుమార్‌ గౌడ్‌.. వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై క్లారిటీ వస్తుందన్నారు. పార్టీలోకి మరికొన్ని చేరికలు కూడా ఉంటాయన్న పీసీసీ చీఫ్‌… ఆ తర్వాతే లెక్కలేసుకుని పదవుల పంపకం ఉంటుందనే విషయం చెప్పకనే చెప్పారన్నమాట.

అయితే, ఇప్పటికే పదవులపై గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ నాయకులు.. మహేష్‌కుమార్‌ గౌడ్‌ కామెంట్స్‌తో నీరసపడిపోయారు. పండగపూట పదవులు తీసుకుని.. దావత్‌ చేసుకుందామనుకున్న నేతలు.. మరికొన్ని రోజులు వెయిటింగ్‌ తప్పదన్న సమాచారంతో నిరాశలో కూరుకుపోయారట. అప్పటికి అదృష్టం వరించేదెవరినో.. దురదృష్టం వెంటాడేదెవరినో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..