Tiger: భయం గుప్పిట్లో భూపాలపల్లి జిల్లా.. పెద్ద పులి సంచారంతో వణుకుతున్న అటవి గ్రామాలు..

Tiger: భయం గుప్పిట్లో భూపాలపల్లి జిల్లా.. పెద్ద పులి సంచారంతో వణుకుతున్న అటవి గ్రామాలు..
Tiger

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరపల్లి గ్రామ శివారు లోని గోడన్ వద్ద రాత్రి సుమారు 10 గంటల సమయంలో సూరం రాములు అనే వ్యక్తి పులిని చూసినట్లు స్థానికులు తెలిపాడు. దీంతో..

Sanjay Kasula

|

Dec 07, 2021 | 8:31 AM

మూడు నెలలవుతోంది పులి జాడలేదు. పులి ఆనవాళ్లు కనిపించాయి.. కానీ పులిని పట్టుకోలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న ఆ జిల్లా జనంపై పులి గర్జించింది.. దాడి చేసింది.. ఓ లేగ దూడను చంపేసింది. గత మూడు నెలలుగా ఏదో ఓ చోటు నిత్యం దాడి చేస్తూనే ఉంది. అంతా ఓ వైపు.. నేను మరోవైపు అన్నట్లుగా పులి దాడి చేస్తోంది. దాని బారినుండి ప్రాణాలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడతాన్నారు అక్కడి జనం. అలాంటిది గత ఐదు రోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో పులి సంచరించడంతో జనం భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరి పై దాడి చేస్తుందనే భయాందోళ ఇప్పుడు అక్కడి గ్రామాల్లో నెలకొంది. తాజాగా సోమవారం ఉదయం పులి అడుగు జాడలు కనిపించాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకరపల్లి గ్రామ శివారు లోని గోడన్ వద్ద రాత్రి సుమారు 10 గంటల సమయంలో సూరం రాములు అనే వ్యక్తి పులిని చూసినట్లు స్థానికులు తెలిపాడు. దీంతో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. పులి అడుగులను గుర్తించారు. ఉదయం తాను చూసిన ప్రాంతాన్ని వెళ్లి పరిశీలించగా ఆ ప్రదేశంలో పులి అడుగు జాడలు స్పష్టంగా కనిపించాయి.

అయితే తాజాగా సోమవారం ఉదయం మల్హర్ మండలం రుద్రారం సుభాష్ నగర్ సమీపంలో స్థానికుల పులి కనిపించింది. శభాష్ నగర్ గ్రామ శివారులో నీలగిరి తోటలో నుండి పత్తి చేనులోకి పులి వెళ్లినట్లు గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు.

ప్రస్తుతం పులి ఆ పత్తి చేనులో మాటువేసి ఉన్నట్లు పలువురు అంటున్నారు. ఉదయం నుండి దేవరంపల్లి, శంకరంపల్లి, సుభాష్ నగర్, రుద్రారం, మాధవరావుపల్లి గ్రామస్తులు పులి సంచారంతో గజగజ వణుకుతున్నారు.

గత ఐదు రోజులుగా కాటారం సబ్ డివిజన్లో పులి సంచరించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకుని సురక్షిత ప్రాంతానికి గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలావుంటే ఒడిపిలవంచ పోచమ్మ వద్ద అక్కేమ్మ ఆవు దూడపై దాడి చేసి చంపేసింది.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: మీరు మీ జీవితంలో ఇలాంటి ముగ్గురికి చాలా దూరంగా ఉండండి.. వారు ఎవరో తెలుసుకోండి..

Crime News: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. వీడియో కాల్ మాట్లాడుతూనే నదిలో దూకిన యువకుడు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu